Commercial cylinder : కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింపు..
ఇంటింటి వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదని సంస్థలు స్పష్టం చేశాయి. అంటే, గృహ వినియోగదారులకు కొత్త ధరల ప్రభావం లేకుండా ఉంటుంది.
- By Latha Suma Published Date - 01:56 PM, Thu - 1 May 25

Commercial cylinder : హోటళ్లు, రెస్టారంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వాడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ఈ తగ్గింపును అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరల్లో సంభవించిన మార్పుల ఆధారంగా అమలు చేస్తున్నట్లు వివరించాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.14.50 తగ్గించినట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. ఇంటింటి వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదని సంస్థలు స్పష్టం చేశాయి. అంటే, గృహ వినియోగదారులకు కొత్త ధరల ప్రభావం లేకుండా ఉంటుంది.
Read Also: Pakistani Nationals : దేశం వీడి వెళ్లేందుకు పాకిస్థానీయుల గడువు పొడిగించిన కేంద్రం!
ఇకపోతే..విమాన ఇంధన ధరలనూ చమరు కంపెనీలు తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో లీటరుకు 4.4 శాతం మేర తగ్గించాయి. అంటే రూ.3,954 మేర తగ్గింది. దీంతో కిలోలీటర్ 85,486.80కు దిగొచ్చింది. ఏప్రిల్ 1న కూడా ఏటీఎఫ్ ధరల్ని 6.15 శాతం (రూ.5,870) మేర చమురు కంపెనీలు తగ్గించాయి. ఏటీఎఫ్ ధరలు తగ్గడం వరుసగా ఇది రెండోసారి. తగ్గిన ధరలతో ఆ మేర విమానయాన సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది.
కాగా, కమర్షియల్గ్యాస్ సిలిండర్లను ఎక్కువగా హోటల్, రెస్టారెంట్లలలో ఉపయోగిస్తుంటారు. ఈ ధరలు తగ్గితే రెస్టారెంట్లపై భారం తగ్గుతుంది. తద్వారా ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది కస్టమర్లకు ఉపయోగకరం అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ముడి చమురు ధరలకు అనుగుణంగా సిలిండర్ ధరలను నిర్ణయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రతి నెలా అయిల్ కంపెనీలు ధరలను సవరిస్తూ ఉంటాయి. ఇక డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులేదు.
Read Also: May Born People : మేలో జన్మించిన వారి వ్యక్తిత్వం, లక్షణాలివీ