CM Yogi Adityanath: ఎయిమ్స్‌లో చేరిన సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి
వృద్ధాప్యంలో ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రి దేవిని రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు సాధారణ చెకప్‌లు జరుగుతున్నాయి. అన్ని రిపోర్టులు వచ్చిన తర్వాత డిశ్చార్జి అవుతారు. తల్లితో పాటు యోగి సోదరి శశి పాయల్, అల్లుడు పురాణ్ పాయల్ కూడా ఉన్నారు.
- By Praveen Aluthuru Published Date - 01:42 PM, Wed - 15 May 24

CM Yogi Adityanath: వృద్ధాప్యంలో ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రి దేవిని రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు సాధారణ చెకప్‌లు జరుగుతున్నాయి. అన్ని రిపోర్టులు వచ్చిన తర్వాత డిశ్చార్జి అవుతారు. తల్లితో పాటు యోగి సోదరి శశి పాయల్, అల్లుడు పురాణ్ పాయల్ కూడా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రి దేవి (85 సంవత్సరాలు) మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎయిమ్స్‌లోని చేరారు. వృద్ధాప్యంలో తలెత్తే సమస్యల కారణంగా సావిత్రి దేవి రొటీన్ చెకప్ కోసం ఇక్కడికి చేరుకుందని ఎయిమ్స్ నిర్వాహకులు తెలిపారు. వివిధ విభాగాల వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. సీఎం కుటుంబ సభ్యుల భద్రత ఏర్పాట్లలో భాగంగా ఎయిమ్స్‌లో పోలీసులు మోహరించారు.
రొటీన్ చెకప్ కోసం ఇక్కడ అడ్మిట్ అయ్యారని ఎయిమ్స్ పీఆర్వో డాక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. అన్ని రిపోర్టులు, వైద్య సంప్రదింపుల అనంతరం డిశ్చార్జి అవుతారు. సాయంత్రానికి నివేదికలు అందజేస్తామని తెలిపారు. అనంతరం ఆయన హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి పరిస్థితిని తెలుసుకునేందుకు ఆర్థిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ కూడా ఎయిమ్స్‌కు చేరుకున్నారు.
Also Read: Bomb Threat Emails : కాన్పూర్, లక్నోలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. అక్కడి నుంచే ఈమెయిల్స్!