CM Revanth: సత్ప్రవర్తన ఖైదీలకు సీఎం రేవంత్ క్షమాభిక్ష
- Author : Balu J
Date : 02-07-2024 - 9:37 IST
Published By : Hashtagu Telugu Desk
CM Revanth: తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న తమ కుటుంబ సభ్యులను విడుదల చేయాలంటూ ఖైదీల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా పాలనలో దరఖాస్తులు అందజేశారు. స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.
దరఖాస్తులను పరిశీలించిన సీనియర్ అధికారులు, అర్హులైన వారి వివరాలను హైలెవల్ కమిటీ ముందుంచారు. హైలెవల్ కమిటీ విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాను క్యాబినెట్ ముందు ఉంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ ఖైదీల విడుదలకు ఆమోదముద్ర వేసింది. అనంతరం ఆ జాబితాకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఖైదీల ముందస్తు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఖైదీలు విడుదలయ్యే అవకాశాన్నాయి.