CM KCR: బలగంతో మహారాష్ట్రకు బయల్దేరిన గులాబీ బాస్
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కె చంద్రశేఖర్ రావు. ఎన్నికలకు సమయం ఆసన్నమవ్వడంతో బీఆర్ఎస్ ను దేశవ్యాప్తం చేసేందుకు అడుగులు
- By Praveen Aluthuru Published Date - 12:33 PM, Mon - 26 June 23

CM KCR: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కె చంద్రశేఖర్ రావు. ఎన్నికలకు సమయం ఆసన్నమవ్వడంతో బీఆర్ఎస్ ను దేశవ్యాప్తం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కెసిఆర్ దేశంలోని పలు రాష్ట్రాలను టార్గెట్ చేశారు. ప్రస్తుతం కెసిఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. ఈ రోజు సోమవారం సీఎం కెసిఆర్ గులాబీ దళంతో ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు. దాదాపు 600 కార్లతో ప్రగతి భవన్ నుంచి భారీ కాన్వాయ్ బయలుదేరింది. రెండు రోజుల పాటు సీఎం కెసిఆర్ మహారాష్ట్రలో పర్యటిస్తారు.
BRS President, CM Sri KCR left for Solapur in Maharashtra by road from Hyderabad today. pic.twitter.com/LpFZ2k5m3c
— BRS Party (@BRSparty) June 26, 2023
మహారాష్ట్ర పర్యటనకు సీఎం కెసిఆర్ తో పాటు పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు. మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు కెసిఆర్ తో పాటు ఉన్నారు.సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా ఒమర్గాలో మధ్యాహ్న భోజనం చేసి, అక్కడి నుంచి సాయంత్రం 4.30కి సోలాపూర్ కి వెళ్తారు. రాత్రి సోలాపూర్ లో బస చేస్తారు.
మంగళవారం ఉదయం సోలాపూర్ నుంచి పండరీపురం వెళతారు. అక్కడ విఠోభా రుక్మిణి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పర్యటనలో సీఎం మహారాష్ట్రలోని కీలక సమావేశాలు నిర్వహిస్తారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోబోతున్నారు. కాగా మంగళవారం రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అయితే కెసిఆర్ బృందం రోడ్డు మార్గాన వెళ్లగా తిరుగు ప్రయాణంలో కెసిఆర్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తారు.
Read More: Father’s Love: ఇలాంటి తండ్రి ఉన్నందుకు గర్వించాల్సిందే, తండ్రీకూతుళ్ల వీడియో వైరల్!