CM Jagan: ఈ నెల 14న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన
- By Balu J Published Date - 06:00 PM, Tue - 12 December 23

CM Jagan: ఎన్నికల సమీపిస్తుండటంతో ఏపీ సీఎం జగన్ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 14న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు వాయుమార్గంలో చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాకుళం జిల్లా మకరంపురం గ్రామానికి సీఎం చేరుకుంటారు.
ఉద్దానం కిడ్నీ సమస్య నివారణకు చేపట్టిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారంభిస్తారు. పలాస చేరుకుని వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్‌ను ప్రారంభించి, శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి పలాస రైల్వే గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు హాజరవుతారు. మరిన్ని జిల్లాల పర్యటనలు చేసే యోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.