Ammavadi : వరుసగా మూడో ఏడాది జగనన్న అమ్మ ఒడి.. వారికి మాత్రమే..?
- By Prasad Published Date - 11:34 AM, Mon - 27 June 22
అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఈ రోజు సీఎం జగన్ నిధులు విడుదల చేయనున్నారు. ఈ రోజు (సోమవారం) శ్రీకాకుళం జిల్లాలో కంప్యూటర్ బటన్ నోక్కి జమ చేయనున్నారు. 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల చేయనున్నారు. ఒకటి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ…43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్లు జమకానున్నాయి. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ. 15,000 ఆర్ధిక సాయం, విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.
కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారికి అమ్మఒడి నగదు అందదు. జిల్లాల్లో లబ్దిదారుల పేర్లను పరిశీలించిన అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారిని జాబితా నుంచి తొలగించారు. విద్యార్థికి 75శాతం హాజరు లేకపోవడం, విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటడం, సొంత కారు, ఆదాయ పన్ను చెల్లిస్తుండటం, పరిమితికి మించి భూమి ఉన్నా, సొంత ఇంటి స్థల పరిమితి దాటడం, బ్యాంకుల్లో ఈ కేవైసీ పూర్తి చేయని వారు అమ్మఒడి పథకానికి అనర్హులు. వారి ఖాతాల్లో నగదు పడదు