Kodali Nani: సంక్షేమ పాలన కొనసాగాలంటే సీఎం జగన్ గెలవాలి: కొడాలి నాని
- Author : Balu J
Date : 09-04-2024 - 11:57 IST
Published By : Hashtagu Telugu Desk
Kodali Nani: గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటీల రాజకీయాలు చేస్తున్న పెత్తందార్లకు, మడమ తిప్పని రాజకీయాలు చేస్తున్న సీఎం జగన్ కు జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. సంక్షేమ పాలన ఇలాగే కొనసాగాలంటే వైసిపికి అండగా నిలవాలని కోరారు. ఎటుంటి లంచాలు లేకుండా పారదర్శకంగా పాలనను అందిస్తున్న సీఎం జగన్ కు ప్రతి ఒక్కరూ మద్దతుగా ఉంటూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు.
అంతకు ముందు ప్రచారంలో భాగంగా ప్రజలకు అభివాదాలు చేస్తూ వివిధ వర్గాల ప్రజానీకంతో మమేకమవుతూ గడపగడపకు ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికి స్వాగతం పలికారు. ప్రజలు. పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నాని ప్రచారానికి మద్దతు తెలిపారు. తీన్మార్ డప్పుల మధ్య, టపాసులు కాలుస్తూ పెద్ద సంఖ్యలో యువత ప్రచారంలో సందడి చేశారు. పలు ప్రాంతాల్లో అబివాదాలు చేస్తున్న చిన్నారులతో ఎమ్మెల్యే నాని ముచ్చటిస్తూ, వారితో ఆప్యాయంగా మాట్లాడారు.