CID Notice To RRR : రఘురామకు ఏపీ సీఐడీ నోటీసులు
వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణంరాజుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది
- By Hashtag U Published Date - 12:45 PM, Wed - 12 January 22

వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణంరాజుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13, 14, 16, 17 తేదీల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరిన్ని వివరాల కోసం విచారణకు రావాలని సీఐడీ కోరింది.హైదరాబాద్, గచ్చిబౌలిలోని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి వెళ్లిన ఏపీ సీఐడీ పోలీసులు ఆయన కుమారుడికి నాలుగు నోటీసులు అంద చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 13న ఎంపీ రానున్నాడు