HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Chinese Spy Balloon Used Us Tech To Spy On Americans Says Report

Chinese Spy Balloon: చైనా నిఘా బెలూన్ లో విషయంలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు?

ఈ సంవత్సరం ప్రారంభంలో అమెరికా గగనతనంలో వచ్చిన చైనా గూడ చర్య బెలూన్ తీవ్ర కలకలం రేపిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయం కొద్దిరోజుల పాటు

  • Author : Anshu Date : 29-06-2023 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chinese Spy Balloon
Chinese Spy Balloon

ఈ సంవత్సరం ప్రారంభంలో అమెరికా గగనతనంలో వచ్చిన చైనా గూడ చర్య బెలూన్ తీవ్ర కలకలం రేపిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయం కొద్దిరోజుల పాటు సంతులనంగా మారింది. కానీ అమెరికా పై నిఘా పెట్టేందుకే డ్రాగన్‌ దీనిని ప్రయోగించిందని అగ్రరాజ్యం తాజాగా తేల్చింది. ఇందుకోసం అమెరికా సాంకేతికతనే చైనా కూడా ఉపయోగించినట్లు బయటపడింది. ఈ మేరకు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనంలో వెల్లడించింది. ఈ బెలూన్‌ను అమెరికా కూల్చివేసి శకలాలను సేకరించిన విషయం తెలిసిందే. వాటిపై ఆ దేశ రక్షణశాఖ, నిఘా సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.

ఈ బెలూన్‌లో యూఎస్‌ గేర్‌తో పాటు ప్రత్యేకమైన చైనీస్‌ సెన్సార్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ సాంకేతికతతో అమెరికాలోని కీలక ప్రదేశాల ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని సేకరించి బీజింగ్‌కు బదిలీ చేయాలని ప్రయత్నించిందని అమెరికా విశ్వసనీయ వర్గాలు వెల్లడించింది. ఇది వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్‌ కాదని అమెరికా పై నిఘా పెట్టాలనే ఉద్దేశంతోనే దీన్ని పంపించారని దర్యాప్తులో తేలినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ఈ బెలూన్‌ అలస్కా, కెనడాతో పాటు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల గగనతలాల మీదుగా ఎనిమిది రోజుల పాటు ప్రయాణించింది.

అయితే, ఈ సమయంలో ఎలాంటి డేటాను ఈ బెలూన్‌ చైనాకు బదిలీ చేసినట్లు ఆధారాలు లభించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ దర్యాప్తు అంశాలపై అటు శ్వేతసౌధం గానీ ఇటు ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ గానీ స్పందించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనాకు చెందిన ఒక భారీ బెలూన్‌ అమెరికాలోని పలు ప్రాంతాల్లో కనిపించింది . అణు క్షిపణుల ప్రయోగ కేంద్రం ఉన్న మోంటానాలో ఈ బెలూన్‌ కన్పించడంతో అమెరికా దీన్ని తీవ్రంగా పరిగణించింది. యుద్ధ విమానాన్ని ప్రయోగించి దీన్ని కూల్చివేసింది. ఈ ఘటన అప్పట్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • china
  • Chinese Spy Balloon
  • Spy Balloon

Related News

Chinese Weapons Iran

Iran-Israel War : చైనా ఆయుధాలు నమ్ముకొని బొక్కబోర్లా పడ్డ ఇరాన్

చైనా ఆయుధాలను నమ్ముకొని దెబ్బతినడం ఇరాన్‌కు ఇది మొదటిసారి కాదు. గతంలో అనేక దేశాలకు ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఈ ఏడాది జనవరిలో వెనిజులా అధ్యక్షుడు మాడూరో, అలాగే గతంలో 'ఆపరేషన్ సిందూర్' సమయంలో

  • Us Israel Attack Iran3

    America Attack on Iran : ఉగ్రసంస్థలకు చేయూత.. చివరకు హతం!

Latest News

  • War Effect : 7 రోజుల్లో గల్ఫ్ నుంచి భారత్ 52వేల మంది

  • T20 WC ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే !!

  • T20 World Cup 2026 Final : ఈరోజైనా అభిషేక్ శర్మ బాట్ కు పనిచెపుతాడా ?

  • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా?

  • అమెరికా కంట్లో నలుసుగా మారిన ఐఆర్‌జీసీ కొత్త క‌మాండ‌ర్‌?!

Trending News

    • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd