First Image : చైనా స్పేస్ స్టేషన్ తొలి ఫొటో ఇదిగో..
First Image : చైనా తన మానవసహిత స్పేస్ స్టేషన్ ‘టియాన్ గాంగ్’ (Tiangong) ఫొటోలను తొలిసారిగా విడుదల చేసింది.
- Author : Pasha
Date : 29-11-2023 - 9:21 IST
Published By : Hashtagu Telugu Desk
First Image : చైనా తన మానవసహిత స్పేస్ స్టేషన్ ‘టియాన్ గాంగ్’ (Tiangong) ఫొటోలను తొలిసారిగా విడుదల చేసింది. అంతరిక్షంలో తేలియాడుతున్న టియాన్ గాంగ్‌ను ఆ ఫొటోల్లో స్పష్టంగా చూడొచ్చు. ఈ స్పేస్ స్టేషన్‌లో వ్యోమగాములు నివసించేందుకు ఇళ్లు, డాకింగ్ హబ్ ఉన్నాయి. ఇందులో విడతలవారీగా ముగ్గురు చైనీస్ శాస్త్రవేత్తలు ఉంటూ ప్రయోగాలు చేస్తున్నారు. అంతరిక్షంలో మొక్కలు ఎలా పెరుగుతాయి ? ద్రవాలు ఎలా ప్రవహిస్తాయి ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకునే దిశగా టియాన్ గాంగ్ స్పేస్ స్టేషన్‌లో చైనీస్ సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
స్పేస్ స్టేషన్‌లో మైక్రోగ్రావిటీ ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అలాంటి వాతావరణంలో వివిధ ప్రయోగాలు చేసి కొత్త విషయాలను తెలుసుకునేందుకు చైనా శాస్త్రవేత్తలు యత్నిస్తున్నారు. దాదాపు 1000 కంటే ఎక్కువ ప్రయోగాలను నిర్వహించే ఎజెండాతో చైనా ఉంది. మరోవైపు అంతరిక్షం నుంచి తన సరిహద్దుల్లోని దేశాలపైనా చైనా నిఘా పెడుతోందనే అనుమానాలు ఉన్నాయి. ముగ్గురు శాస్త్రవేత్తలు చొప్పున బ్యాచ్‌గా ఏర్పడి టియాన్ గాంగ్ స్పేస్ స్టేషన్‌లో ఆరు నెలల పాటు ఉండి వస్తున్నారు. ఈవిధంగా చైనా శాస్త్రవేత్తల టీమ్ అక్టోబరు 30న భూమికి తిరిగి వచ్చే ముందు పై ఫొటోను(First Image) తీసింది.