HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >China Hanged Teacher Who Poisoned 25 Of Her Students And Killing One

Teacher Hanged : టీచర్ ను ఉరి తీసిన చైనా.. ఎందుకంటే ?

  • Author : Pasha Date : 15-07-2023 - 10:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Suicide Hanging 19
Suicide Hanging 19

Teacher Hanged : ఒక కీచక టీచర్ కు చైనా ఉరి శిక్ష వేసింది. 

 25 మంది స్టూడెంట్స్ కు విషమిచ్చి.. వారిలో ఒకరి మరణానికి కారణమైనందుకు ఆమెను ఉరితీసింది. 

గురువారం ఆమెను ఉరితీయగా .. ఆ విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది.. 

ఇంతకీ ఏమిటీ కేసు ? ఆమె స్టూడెంట్స్ కు ఎందుకు విషం ఇచ్చింది ? 

చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌ కు చెందిన వాంగ్ యున్ ఒక కిండర్ గార్టెన్ టీచర్.. మెంగ్‌మెంగ్ ప్రీ స్కూల్ లో పనిచేసేది.. 40 ఏళ్ల వయసున్న ఆమె  క్రూరంగా, రాక్షసంగా ఆలోచించింది. తాను క్లాస్ చెప్పే కిండర్ గార్టెన్  స్టూడెంట్స్ కు 2019 మార్చి 27న   గంజిలో విషపూరితమైన సోడియం నైట్రేట్‌ను కలిపి ఇచ్చింది. ఆ గంజి తాగిన స్కూలు పిల్లలలో  ఒకరు మృతిచెందారు. మిగితా విద్యార్థులు 10 నెలల ట్రీట్మెంట్ తర్వాత  కోలుకున్నప్పటికీ.. వాళ్ళ బాడీలోని చాలా అవయవాల పనితీరు దెబ్బతింది.  అందుకే ఈ కేసును హెనాన్ ప్రావిన్స్‌లోని జియాజువో నగరంలో ఉన్న నెం. 1 ఇంటర్మీడియట్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. వాంగ్ యున్ కు మరణ శిక్ష విధించింది. దీన్ని గురువారం (జులై 13న) అమలు చేశారు.

Also read :  Hyderabad-Skyroot : హైదరాబాద్ “స్కై రూట్” రాకెట్లతో ఫ్రాన్స్ శాటిలైట్ల మోహరింపు.. ఖరారైన డీల్

ఎందుకు అలా చేసింది ? 

అంతకుముందు వాంగ్ యున్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. గతంలో ఒకసారి తన భర్తకు కూడా ఇదే విషం(సోడియం నైట్రేట్‌) కలిపి ఇచ్చానని చెప్పింది. అయితే తన భర్త కొద్దిపాటి అస్వస్థతతో బయటపడ్డాడని తెలిపింది. ఈ రెండుసార్లు కూడా ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే తాను  అన్నంలో విషం కలిపానని పోలీసు దర్యాప్తులో వాంగ్ యున్ ఒప్పుకుంది. “స్టూడెంట్స్ ను క్లాస్ రూంలో మెయింటైన్ చేసే విషయంలో నాకు మరో టీచర్ తో జరిగిన గొడవను మనసులో ఉంచుకొని.. ఆ క్లాస్ లోని పిల్లలు తినే అన్నంలో విషం కలిపాను” అని పోలీసులకు వాంగ్ యున్ చెప్పింది.  దీంతో ఆమెను కోర్టు దోషిగా 2019లోనే  ఖరారు చేసింది.  అయితే ఆమెకు మరణశిక్షను విధిస్తూ  ఈవారంలోనే  తీర్పును ఇచ్చింది.

Also read : Rafale Jet: భారత్, ఫ్రాన్స్ మధ్య భారీ రక్షణ ఒప్పందం.. 26 రాఫెల్ జెట్‌ల కొనుగోలుకు భారత్ ఆమోదం..!

ఉరివేశారా ? కాల్చి చంపారా ? 

వాంగ్ యున్ కు మరణ శిక్ష ఎలా వేశారనే దానిపై ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు.  అయితే  శిక్షను అమలు చేయడానికి ముందు వాంగ్ ను జైలు అధికారులు ఉరితీసే గ్రౌండ్ కు తీసుకెళ్లారని వార్తలు వస్తున్నాయి.  బుల్లెట్‌తో తల వెనుక భాగంలో కాల్చి కూడా చైనాలో మరణశిక్షను అమలు చేస్తుంటారు. కొన్ని కేసులలో మరణ శిక్ష అమలుకు ప్రాణాంతక ఇంజెక్షన్‌లు ఇస్తుంటారు. ప్రపంచంలోని మిగిలిన దేశాల కంటే చైనా ఎక్కువగా మరణశిక్షలను అమలు చేస్తోంది. అయితే మీడియాపై ఉన్న సెన్సార్ కారణంగా ఆ వివరాలు ఎక్కువగా బయటికి రావు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • China court
  • Chinese teacher
  • Kindergarten Teacher
  • Poisoned 25 Students
  • Teacher Hanged

Related News

China Space

అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

భారతదేశానికి స్వంత అంతరిక్ష కేంద్రం ఉండటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. మనం ఏ ప్రయోగం చేయాలన్నా ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

    Latest News

    • రక్తనాళాల ఆరోగ్యమే మెదడు ఆరోగ్యం !!

    • లా సెట్ పరీక్ష అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన టీ-శాట్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ కీల‌క నిబంధ‌న‌లు!

    • వైవీ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనా ?

    • Telangana Municipal Elections : కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన మంత్రి ఉత్తమ్

    Trending News

      • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

      • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

      • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

      • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

      • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd