Chicken Price: కొండెక్కిన కోడి.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు..!
- Author : HashtagU Desk
Date : 21-03-2022 - 11:48 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర కొండెక్కింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకంగా కేజీ చికెన్ ధర ట్రిబుల్ సెంచరీ కొట్టింది. కొన్ని వారాల వ్యవదిలోనే చికెన్న ధర 300 దాటడం గమనార్హం. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కోడి మాంసం ధరలు పెరిగిపోవడంతో మాంసాహార ప్రియులు లోబదిబోమంటున్నారు. ఈ క్రమంలో ఏపీలోని విజయవాడ నగరంలో గత నెలలో కేజీ చికెన్ ధర 160రూపాయలుగా ఉంది. అయితే ఇప్పుడు విజయవాడలో ఇప్పుడు కిలో చికెన్ ధర 306రూపాయలకు చేరుకుంది.
ఇక తెలంగాణలోని హైదరాబాద్ మహానగరంలో గత నెల 7వ తేదీన కేజీ చికెన్ ధర 185 రూపాయలుగా ఉంటే.. ఇపుడది 300 రూపాయలకు చేరుకుంది. దీంతోచికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో మాంసాహారప్రియులే కాదు వ్యాపారం లేక వ్యాపారులు తీవ్ర నిరుత్సాహం చెందుతున్నారు. ఇకపోతే గత మూడు నెలల కాలంలో ఫౌల్ట్రీ రైతులు ఎక్కువగా బ్రాయిలర్ కోళ్లను పెంచేందుకు సాహసించలేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో మార్కెట్‌లో చికెన్ డిమాండ్‌కి తగ్గ కోళ్ల ఉత్పత్తి లేకపోవడంతో చికెన్ రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బ్రాయిలర్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు.