Gold- Silver Rates: గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. పండుగ కానుకగా తగ్గిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Rates) నేడు తగ్గాయి.
- By Gopichand Published Date - 07:36 AM, Sun - 12 November 23
Gold- Silver Rates: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Rates) నేడు తగ్గాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,550గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,630గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.76,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (నవంబర్ 12, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: Team India Celebrate Diwali: బెంగళూరు హోటల్లో టీమిండియా ఆటగాళ్ల దీపావళి వేడుకలు..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,750గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,090గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,550 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,600 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.5,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,630గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.5,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,630గా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,000 ఉండగా, ముంబైలో రూ.73,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, కోల్కతాలో రూ.73,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,750 ఉండగా, కేరళలో రూ.76,000గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, విజయవాడలో రూ.76,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
Zomato: జొమాటో మరో కీలక నిర్ణయం.. ఫాస్ట్ డెలివరీలు కావాలంటే ఎక్స్ట్రా ఫీజు కట్టాల్సిందే..!
జొమాటో కొత్త ఫీచర్ని ప్రయత్నిస్తోంది. దీని ద్వారా మీరు మీ ఆహారాన్ని వేగంగా డెలివరీ చేయడానికి జొమాటోకు అదనంగా చెల్లింపు చేయాల్సి ఉంటుంది.