Gold- Silver Rates: భారీగా తగ్గిన ధరలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Rates) నేడు కూడా తగ్గాయి.
- By Gopichand Published Date - 07:35 AM, Fri - 10 November 23
Gold- Silver Rates: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Rates) నేడు కూడా తగ్గాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,760గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.76,200కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (నవంబర్ 10, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: Chikungunya : మొట్టమొదటి చికున్‌గున్యా వ్యాక్సిన్ రిలీజ్.. ఎలా పనిచేస్తుంది ?
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,910గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,150 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,250గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,760 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760గా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,200 ఉండగా, ముంబైలో రూ.73,200గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా, కోల్‌కతాలో రూ.73,200గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,500 ఉండగా, కేరళలో రూ.76,200గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా, విజయవాడలో రూ.76,200 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
Swiggy: స్విగ్గీకి షాక్ ఇచ్చిన ఐస్ క్రీమ్.. అసలేం జరిగిందంటే..?
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.