Gold- Silver Rates: స్వల్పంగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Rates) నేడు స్వల్పంగా పెరిగాయి.
- By Gopichand Published Date - 07:03 AM, Thu - 26 October 23
Gold- Silver Rates: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Rates) నేడు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,800గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.77,500కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం (అక్టోబర్ 26, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: Thalaivar 170: ఇద్దరు లెజెండ్స్ కలిసిన వేళ.. అమితాబ్ తో రజనీ స్క్రీన్ షేర్
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,950గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,800 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800గా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,600 ఉండగా, ముంబైలో రూ.74,600గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500 ఉండగా, కోల్కతాలో రూ.74,600గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,000 ఉండగా, కేరళలో రూ.77,500గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.77,500 ఉండగా, విజయవాడలో రూ.77,500 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
Silver Price: లక్ష రూపాయలకు చేరువలో కిలో వెండి ధర..?
వెండి తన ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకారం కిలో వెండి రూ.85,700కి చేరింది.