Best Airport: రెండేళ్లకు తిరిగి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న ఛాంగి ఎయిర్ పోర్ట్!
ప్రపంచంలో అత్యంత అత్యుత్తమమైన అంతర్జాతీయ విమానాశ్రయంగా సింగపూర్ కు చెందిన ఛాంగి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమమైన విమానాశ్రయంగా పేరు సంపాదించుకోవడమే కాకుండా మొదటి స్థానంలో ఈ విమానాశ్రయం నిలిచింది.
- By Nakshatra Published Date - 08:43 PM, Thu - 16 March 23

Best Airport: ప్రపంచంలో అత్యంత అత్యుత్తమమైన అంతర్జాతీయ విమానాశ్రయంగా సింగపూర్ కు చెందిన ఛాంగి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమమైన విమానాశ్రయంగా పేరు సంపాదించుకోవడమే కాకుండా మొదటి స్థానంలో ఈ విమానాశ్రయం నిలిచింది. ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి ఈ విమానాశ్రయం కరోనా సమయంలో రెండవ స్థానంలోకి పడిపోయింది. సింగపూర్ విదేశీ విమానాల రాకపోకలపై తీవ్రమైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ విమానాశ్రయం మొదటి స్థానం నుంచి రెండవ స్థానానికి వెళ్ళింది. ఇక మొదటి స్థానంలో ఖతార్ మొదటి స్థానంలో నిలిచింది.
ఇలా కరోనా పరిస్థితిలో నేపథ్యంలో రెండవ స్థానంలోకి వెళ్లిన ఛాంగి విమానాశ్రయం రెండేళ్లకు తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకుంది. కరోనా తర్వాత సింగపూర్ విదేశీ విమానయాన సంస్థ ఆశలు తీసివేయడంతో తిరిగి ఈ విమానాశ్రయం మొదటి స్థానంలోకి చేరుకుంది. ఇక రెండవ అత్యుత్తమమైన విమానాశ్రయంగా ఖతార్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానంలో ఉండగా, టోక్యోలోని హనీదా విమానాశ్రయం మూడో స్థానంలో నిలిచింది.
విమాన ప్రయాణం చేసిన తర్వాత ప్రయాణికులు విమానంలో వారికి అందించిన సేవలను వారి సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని విమానాశ్రయాలకు రేటింగ్ ఇస్తారు. ఇలా ప్రయాణికులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా స్కై ట్రాక్స్ సంస్థ థియేటర్ సర్వే నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ప్రపంచంలోనే టాప్ 20 విమానాశ్రయాలను గుర్తించి స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్ పోర్ట్ అవార్డ్స్ పేరిట సత్కరిస్తుంది ఇలా మొదటి 20 అత్యుత్తమమైన విమానాశ్రయాలలో టాప్ 10 వరకు అమెరికాకు చెందిన ఒక్క విమానాశ్రయం కూడా లేకపోవడం గమనార్హం. మరి ఆ 20 విమానాశ్రయాలు ఏంటి అనే విషయానికి వస్తే…
ఛాంగి: సింగపూర్, హమద్: దోహా, హనీదా: టోక్యో, ఇన్చేయాన్: సియోల్, చార్లెస్ డి గలే: పారిస్, ఇస్తాంబుల్: తుర్కియో, మ్యూనిక్: జర్మనీ, జ్యూరిక్: స్విజర్లాండ్, నరీతా: టోక్యో, బరాజస్: మాడ్రిడ్, వియన్నా: ఆస్ట్రియా, వాంటా: ఫిన్లాండ్, ప్యూమిసినో: రోమ్, కోపెన్ హెగెన్: డెన్మార్క్, కాన్సాయ్: జపాన్, సెంట్రైన్ నయోగా: జపాన్, దుబాయ్, టకోమా: సియాటెల్, మెల్బోర్న్: ఆస్ట్రేలియా, వాంకోవర్: కెనడా
