Chandrayaan 3 Budget : చంద్రయాన్ 3 ఖర్చు..ప్రభాస్ మూవీ కన్నా తక్కువే
చంద్రయాన్ 3 కి కేవలం రూ.615 కోట్ల బడ్జెటుతో అద్భుతమైన కలను సాకారం చేసి చూపిస్తే..ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ కి రూ. 700 కోట్లకు పైగా నిర్మాతలు ఖర్చు
- By Sudheer Published Date - 11:25 AM, Thu - 24 August 23
జాబిల్లి ఫై అడుగుపెట్టి భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రయాన్ సక్సెస్ (Chandrayaan-3 Success) తో ఇండియా (India) పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ఏకైక దేశంగా భారత్ చరిత్ర లిఖించింది. రోదసిలో ఇప్పటివరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇస్రో (ISRO) విజయవంతంగా చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువం (South Pole)పై విక్రమ్ ల్యాండర్ (Vikram Lander)ను దించింది. దీంతో ప్రపంచ దేశాలు భారత్ కృషిని కొనియాడుతున్నాయి. చంద్రయాన్-3 సక్సెస్ఫుల్ ల్యాండింగ్ కాగానే ప్రపంచ నాయకులు, శాస్త్రవేత్తలు ఇండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
భారత అంతరిక్ష చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది భారతీయుల కల నెరవేరుస్తూ.. భారత దేశానికి అరుదైన కీర్తిని అందించిన ఇస్రో శాస్త్రవేత్తలు మరియు సిబ్బంది కి ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు అంటూ వారంతా విషెష్ తెలుపుతున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో మన తెలుగువారి పాత్ర కూడా ఉంది. సీనియర్లతో పాటుగా యువ సైంటిస్టులు భాగస్వాములుగా ఉన్నారు. గుంటూరు జిల్లా అమృతలూరుకు చెందిన యువ సైంటిస్ట్ బొల్లు మానస కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్నారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగేలా ఇస్రో రూపొందించిన సాఫ్ట్వేర్ టెస్టింగ్ సైంటిస్టుల టీమ్‌లో ఆమె కూడా ఒకరు.
ఇదిలా ఉంటె చంద్రయాన్ 3 ఖర్చు కంటే మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కే ఎక్కువ ఖర్చు చేసారని సోషల్ మీడియాలో అంత మాట్లాడుకుంటున్నారు. బాహుబలి మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ (Prabhas)..ఆ తర్వాత నుండి వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ (Adipurush ) మూవీ చేసాడు. ఈ మూవీ బడ్జెట్ చంద్రయాన్ 3 బడ్జెట్ కంటే ఎక్కువే.
ఇస్రో.. చంద్రయాన్ 3 కి కేవలం రూ.615 కోట్ల బడ్జెటుతో అద్భుతమైన కలను సాకారం చేసి చూపిస్తే..ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ కి రూ. 700 (Adipurush Budget)కోట్లకు పైగా నిర్మాతలు ఖర్చు చేసారని అంత అంటున్నారు. అలాంటి ప్లాప్ సినిమాలకు వందల కోట్లు ఖర్చు చేసే బదులు చంద్రయాన్ లాంటి ప్రయోగాలకు ఖర్చు చేస్తే.. భారత్ పేరు చిరస్థాయిగా ఉంటుంది కదా అని దేశ భక్తులు వాపోతున్నారు. తాజాగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా రన్ అవుతున్న హాలీవుడ్ చిత్రాలు ‘బార్బీ’ (145 మిలియన్ డాలర్లు/రూ.1,197 కోట్లు), ‘ఓపెన్‌హైమర్’ (100 మిలియన్ డాలర్లు/రూ.825 కోట్లు)ల బడ్జెటు సైతం చంద్రయాన్-3 కంటే ఎక్కువే. ఏది ఏమైనప్పటికి చంద్రయాన్ 3 సక్సెస్ తో ప్రతి భారతీయుడు కాలర్ ఎగరేస్తున్నాడు.
Read Also : Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతం.. మూన్ మిషన్ కోసం కసరత్తులు చేస్తున్న పలు దేశాలు..!
Tags
Related News
Baahubali : కట్టప్ప విలన్‌గా బాహుబలి యానిమేషన్ సిరీస్.. ట్రైలర్ చూసారా..?
బాహుబలి యానిమేషన్ సిరీస్ ట్రైలర్ చూసారా..? కట్టప్ప విలన్‌గా మారితే బాహుబలి, భల్లాలదేవ కలిసి అతడి పై యుద్ధం చేస్తున్నారు.