Chandrababu : టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని పరామర్శించిన చంద్రబాబు
ఇటీవల గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని టీడీపీ అధినేత
- By Prasad Published Date - 08:06 AM, Wed - 1 February 23

ఇటీవల గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. విజయవాడలోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయను చూసేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు వెళ్లారు. బచ్చుల అర్జునుడికి అందుతున్న వైద్యంపై డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను చంద్రబాబు కోరారు.అనంతరం ఆసుపత్రిలో ఉన్న బచ్చుల అర్జునుడు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బచ్చుల అర్జునుడిని ఈపరిస్దితిల్లో చూస్తానుకోలేదని..ఇది చాలా బాధాకరమన్నారు. మరో 2 రోజులు గడిస్తే కానీ చెప్పలేమని వైద్యులు తెలిపారని.. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉంచి వైద్యం అందిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. అర్జునుడిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నారు. తారకరత్న ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందన్నారు.