HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Chandrababu Reaction To The Removal Of The Special Status Item

Chandrababu: అజెండాలో ప్ర‌త్యేక‌ హోదా అంశం తొలగింపు.. చంద్ర‌బాబు షాకింగ్ రియాక్ష‌న్..!

  • Author : HashtagU Desk Date : 15-02-2022 - 11:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
Chandrababu

ప్ర‌స్తుతం ఏపీలో ప్ర‌త్యేక హోదా ర‌గ‌డ జ‌రుగుతున్న నేప‌ధ్యంలో, తాజాగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రత్యేక హోదాపై సీఎం జ‌గ‌న్ స్టాండ్ ఏంటని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. తాజాగా టీడీపీ సీనియర్ నేతలతో స‌మావేశంలో భాగంగా చంద్రబాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంతో యుద్ధం చేయ‌లేక చేతులెత్తేశార‌ని జ‌గ‌న్ వ్యావ‌హారం శైలిని త‌ప్పుప‌ట్టారు చంద్ర‌బాబు.

త్రిస‌భ్య భేటీ అజెండాలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా తమ ఘనత అని చెప్పుకున్న వైసీపీ నేతలు, ఆ త‌ర్వాత ఆ అజెండాలో ప్ర‌త్యేక హోదా అంశాన్ని తొల‌గించ‌గానే టీడీపీ పై బురద జల్లుతున్నారని చంద్రబాబు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఇక ఏపీలో ఆదాయం తగ్గకపోయినా, జ‌గ‌న్ స‌ర్కార్ రాష్ట్ర‌ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసింద‌ని చంద్రబాబు మండిప‌డ్డారు. మోటార్లకు మీటర్ల బిగింపును వైసీపీ ప్రభుత్వం త‌క్ష‌ణ‌మే నిలిపివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇక లేని సమస్యలు క్రియేట్ చేసి చివరకు, సినీ ప్ర‌ముఖుల్ని ఇంటికి పిలిపించుకుని మ‌రీ వారిని అవమానపర్చారని చంద్రబాబు ఆరోపించారు. మ‌రి చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల పై వైసీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhrapradesh special status
  • chandrababu
  • tdp
  • ys jagan
  • ysrcp

Related News

YS Jagan pays tribute to YSR.

YSR: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి సమాధిపై పూలమాలలు ఉంచి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ ఆత్మీయ స్మరణ కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన తల్లి వైఎస్ విజ

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd