CBN: ధైర్యంగా ముందుకు సాగండి పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు భరోసా
అలజడులు సృష్టించి టీడీపీ శ్రేణులను భయపెట్టాలని ప్రభుత్వం చూస్తోందని, భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు.
- By Hashtag U Published Date - 04:54 PM, Sun - 28 August 22

అలజడులు సృష్టించి టీడీపీ శ్రేణులను భయపెట్టాలని ప్రభుత్వం చూస్తోందని, భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. కార్యకర్తలతో ఈ రోజు ఆయన టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తాను కార్యకర్తలతోనే ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.
అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరమే లేదని చెప్పారు. అవసరమైతే కార్యకర్తలను కాపాడుకోవడం కోసం తాను జైలుకెళ్తానన్నారు. జైలుకెళ్లిన టీడీపీ కార్యకర్తల కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. అరెస్టయిన కార్యకర్తలను 3 రోజుల్లో బయటకు తీసుకొస్తానని వారికి భరోసా ఇచ్చారు.