Assistant Section Officers: 1,592 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌లను సెక్షన్ ఆఫీసర్‌గా పదోన్నతి
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌లను సెక్షన్ ఆఫీసర్‌గా పదోన్నతి కల్పించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా 1,592 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌లను
- Author : Praveen Aluthuru
Date : 27-06-2023 - 8:31 IST
Published By : Hashtagu Telugu Desk
Assistant Section Officers: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌లను సెక్షన్ ఆఫీసర్‌గా పదోన్నతి కల్పించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా 1,592 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌లను సెక్షన్ ఆఫీసర్‌గా తక్షణమే పదోన్నతి కల్పించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం తెలిపారు. పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులను సంబంధిత క్యాడర్ కంట్రోలింగ్ అధికారుల ద్వారా త్వరలో జారీ చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తుంది. ASO మరియు ఇతర గ్రేడ్‌లలో మరో 2,000 పదోన్నతులు త్వరలో ఆమోదం పొందనున్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి వారికి పదోన్నతి లభిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు మంత్రి. గత ఏడాది కూడా దాదాపు 9,000 ప్రమోషన్లు జరిగాయని, అంతకు ముందు మూడు సంవత్సరాల్లో 4,000 ప్రమోషన్లను డిఓపిటి మంజూరు చేసిందని మంత్రి చెప్పారు.
Read More: Viral Video: తల్లి కోరిక తీర్చిన ఎయిర్ లో కో-పైలట్