Gyanvapi Case: జ్ఞానవాపి కేసు తీర్పుతో కాశీలో ఆనంద వాతావరణం
జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పు అనంతరం కాశీలో ఆనంద వాతావరణం కనిపిస్తోంది. జ్ఞానవాపి ముందు జన సందోహం మొదలైంది. ఋషులు, సాధువులు ఆనందంతో శంఖం ఊదుతూ సందడి చేస్తున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 03-08-2023 - 3:56 IST
Published By : Hashtagu Telugu Desk
Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పు అనంతరం కాశీలో ఆనంద వాతావరణం కనిపిస్తోంది. జ్ఞానవాపి ముందు జన సందోహం మొదలైంది. ఋషులు, సాధువులు ఆనందంతో శంఖం ఊదుతూ సందడి చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఋషులు, సాధువులు కాశీకి వస్తున్నారు. ప్రజలు హర్ హర్ మహాదేవ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కొందరు వ్యక్తులు శివుని ఆయుధమైన త్రిశూలాన్నిపట్టుకుని నినాదాలు చేస్తున్నారు.
హిందూ తరపు న్యాయవాది సీతా సాహు మాట్లాడుతూమాకు అనుకూలంగా చారిత్రాత్మక నిర్ణయం వచ్చిందని, ఇప్పుడు జ్ఞానవాపిలో ASI సర్వే పూర్తిగా జరుగుతుందని చెప్పారు. ఇంతకుముందు ఏ సర్వే చేసినా అందులో చాలా విషయాలు బయటకు వచ్చాయి. త్రిశూల్, ఘరియాల్, శంఖం ఇలా.. కానీ ఇప్పుడు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మసీదు ఉందా, గుడి ఉందా అన్నది పూర్తిగా ఎస్‌ఐ సర్వే నుంచి తేలనుంది. మరోవైపు వారణాసి పోలీసు బలగాలతో నిండిపోయింది.
వారణాసిలో ఉన్న జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) శాస్త్రీయ సర్వే నిర్వహించాలని వారణాసి జిల్లా జడ్జి తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. మొత్తానికి శుక్రవారం నుండి ASI సర్వే ప్రారంభమవుతుంది.
Also Read: Rashmika : పెళ్లి చేసుకున్నట్లు తెలిపి షాక్ ఇచ్చిన రష్మిక