CBSE 10th Result 2025 : CBSE 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్
CBSE 10th Result 2025 : విజయవాడ రీజియన్ అత్యధికంగా 99.60% పాస్ పర్సంటేజ్‌ను నమోదు చేసింది. అనంతరం తిరువనంతపురం రీజియన్ 99.32%, చెన్నై రీజియన్ 97.39% ఉత్తీర్ణతతో ముందున్నాయి.
- By Sudheer Published Date - 02:28 PM, Tue - 13 May 25

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 సంవత్సరానికి చెందిన పదవ తరగతి ఫలితాలను (CBSE 10th Result) ఈరోజు మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. ఎప్పటిలాగే మే నెల రెండో వారంలో ఫలితాలను విడుదల చేసిన బోర్డు, ఉదయం 12వ తరగతి ఫలితాల తర్వాత మధ్యాహ్నం పదవ తరగతికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. ఈసారి మొత్తం ఉత్తీర్ణత శాతం 93.60% గా నమోదైంది. ఇది గత ఏడాది కంటే 0.06 శాతం అధికం. ఈ ఏడాది పరీక్షలు రాసిన విద్యార్థుల్లో అమ్మాయిలు అబ్బాయిలను అధిగమించారు. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 95% కాగా, అబ్బాయిల దానికి 2.37% తక్కువగా ఉంది.
Google Logo : గూగుల్ లోగో మారింది..మీరు గమనించారా..?
ఇక రీజియన్ వారీగా పరిశీలిస్తే.. విజయవాడ రీజియన్ అత్యధికంగా 99.60% పాస్ పర్సంటేజ్‌ను నమోదు చేసింది. అనంతరం తిరువనంతపురం రీజియన్ 99.32%, చెన్నై రీజియన్ 97.39% ఉత్తీర్ణతతో ముందున్నాయి. మరోవైపు 12వ తరగతి ఫలితాలు కూడా ఈరోజే ఉదయం విడుదలయ్యాయి. అందులో 88.39% ఉత్తీర్ణత నమోదైంది. ఇది గత ఏడాది కంటే 0.41% అధికం కావడం గమనార్హం. ఈ ఫలితాలు విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించడమే కాకుండా, రాష్ట్రాల విద్యా ప్రమాణాలపైనా స్పష్టతనిచ్చాయి.
విద్యార్థులు తమ ఫలితాలను https://cbseresults.nic.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలను తెలుసుకోవడానికి రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ నంబర్ అవసరం. అంతేకాదు, డిజీలాకర్ (DigiLocker), ఉమాంగ్ (UMANG) మొబైల్ యాప్‌ల ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. ఈ ఫలితాలతో విద్యార్థులకు ఉన్నత విద్యలో అడుగులు వేయడానికి మార్గం సుగమమవుతుంది. CBSE బోర్డు మంచి ప్రణాళికతో పరీక్షలు నిర్వహించి, సమయానికి ఫలితాలు విడుదల చేయడం అభినందనీయంగా చెప్పొచ్చు.