Deputy CM Tejashwi Yadav: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు సీబీఐ సమన్లు
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కష్టాలు పెరుగుతున్నాయి. సీబీఐ గతంలో లాలూ యాదవ్‌ను, ఆయన భార్య రబ్రీ దేవిని ప్రశ్నించగా, ఇప్పుడు తదుపరి నంబర్ లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ (Tejashwi Yadav)దే.
- By Gopichand Published Date - 11:47 AM, Sat - 11 March 23

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కష్టాలు పెరుగుతున్నాయి. సీబీఐ గతంలో లాలూ యాదవ్‌ను, ఆయన భార్య రబ్రీ దేవిని ప్రశ్నించగా, ఇప్పుడు తదుపరి నంబర్ లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ (Tejashwi Yadav)దే. ఈ కేసులో తేజస్వి యాదవ్‌కు సీబీఐ రెండోసారి సమన్లు పంపింది. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను శనివారం (మార్చి 11) విచారణ నిమిత్తం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలిచారు.
ఇంతకుముందు తేజస్వి యాదవ్‌ను ఫిబ్రవరి 4న ఢిల్లీకి విచారణకు పిలిచారని, ఇందుకోసం ఆయనకు సమన్లు పంపామని, అయితే అసెంబ్లీ సమావేశాలను చూపిస్తూ తేజస్వి యాదవ్ ఢిల్లీకి రాలేదని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడు మళ్లీ విచారణకు పిలిచారు.
Also Read: Congress: కాంగ్రెస్ సీనియర్ నేత గుండెపోటుతో కన్నుమూత
గతంలో ఉద్యోగాల కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందాలు ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, పాట్నాలోని 20కి పైగా చోట్ల శుక్రవారం దాడులు నిర్వహించాయి. లాలూ యాదవ్ కుమార్తెల ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. దీంతో పాటు ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న తేజస్వి ఇంటిపై కూడా ఈడీ దాడులు చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈడీ దాడులు జరిగిన ఒక రోజు తర్వాత తేజస్వీ యాదవ్‌ను సీబీఐ విచారణకు పిలిచింది. ఈ దాడుల్లో రూ.53 లక్షల నగదు, 1900 డాలర్లు, దాదాపు 540 గ్రాముల బంగారం, 1.5 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. ఈడి దాడిపై రాష్ట్రీయ జనతాదళ్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. కేంద్రంలోని అధికార బీజేపీ రాజకీయ ప్రత్యర్థులతో కుమ్మక్కై సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ వంటి సంస్థలకు స్క్రిప్ట్‌లు అందజేస్తోందని ఆర్జేడీ నేతలు ఆరోపించారు.
ఈ కేసులో లాలూ యాదవ్, ఆయన భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై క్రిమినల్ కుట్ర, అవినీతి నిరోధక చట్టం నిబంధనల కింద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. నిందితులందరినీ మార్చి 15న హాజరుకావాలని రూస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. 2022 మే నెలలో సీబీఐ వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వ్యవసాయ భూములు ఇచ్చి 12 మంది రైల్వే శాఖలో ఉద్యోగాలను పొందినట్టు సీబీఐ పేర్కొంది. 2004 నుంచి 2009 మధ్యలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కామ్ జరిగిందని సీబీఐ ఆరోపిస్తోంది.

Related News

YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో సంచలన పరిణామం.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్
దివంగత నేత, కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.