‘Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ చిత్ర నిర్మాణ సంస్థలపై కేసు
హీరో నాని నటించిన 'అంటే సుందరానికి' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- Author : Prasad
Date : 11-06-2022 - 2:49 IST
Published By : Hashtagu Telugu Desk
హీరో నాని నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్‌ను పోలీసు అనుమతి లేకుండా నిర్వహించినందున మైత్రీ మూవీస్, శ్రేయాస్ మీడియా సంస్థపై మాదాపూర్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. జూన్ 9న శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర నుంచి ఎలాంటి అనుమతి లభించలేదని పోలీసులు తెలిపారు. ఈవెంట్‌కి సంబంధించిన అప్లికేషన్ లెటర్ ఈవెంట్ జరిగిన మరుసటి రోజు అంటే జూన్ 10న కమిషనర్ దగ్గరికి చేరింది. అయితే దరఖాస్తు పెట్టిన వారు ఆ దరఖాస్తు చేరిందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా పబ్లిక్ ఈవెంట్‌లో బౌన్సర్లు ఉండటంతో పాటు నిర్వాహకులు కొన్ని భద్రతా చర్యలను పాటించలేదని తెలిసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన మాదాపూర్ పోలీసులు IPC సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.