Balakrishna : జూబ్లీహిల్స్‌లో బాలకృష్ణ ఇంటి ముందు కారు బీభత్సం
Balakrishna : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna House) ఇంటి ముందు ఉన్న ఫుట్‌పాత్‌పైకి కారు దూసుకెళ్లింది
- By Sudheer Published Date - 12:08 PM, Fri - 14 March 25

హైదరాబాద్ జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో ఓ కారు అతివేగంగా (Car Overspeed) దూసుకెళ్లి బీబత్సం సృష్టించింది. రోడ్డు నెంబర్-1లో ఉన్న సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna House) ఇంటి ముందు ఉన్న ఫుట్‌పాత్‌పైకి కారు దూసుకెళ్లింది. మాదాపూర్ వైపు నుంచి వచ్చిన కారు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దిశగా ప్రయాణిస్తుండగా, అదుపుతప్పి బాలకృష్ణ ఇంటి ముందు ఉన్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. కారును వేగంగా వస్తుండగా గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు.
BJP : నామినేటెడ్ పదవులపై అధిష్టానం నిర్ణయం : పురంధేశ్వరి
ఈ ఘటనలో ఫెన్సింగ్ పూర్తిగా దెబ్బతిన్నదే కాకుండా, కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. అదుపుతప్పి కారు ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లడం వల్ల అక్కడ ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నారు. కారు వేగం ఎంతగా ఉండి ఉండొచ్చో, డ్రైవర్ మద్యం సేవించాడా లేదా అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. బాలకృష్ణ ఇంటి వద్ద ప్రమాదం చోటుచేసుకోవడంతో ఈ సంఘటనపై సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.