HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cancer Disappears After 6 Months Drug Trial

Cancer: గుడ్ న్యూస్..క్యాన్సర్ ను నిరోధించే ఔషదం..ట్రయల్స్ లో వందశాతం ఫలితాలు..!!

క్యాన్సర్ ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి. ఇది మానవుడి పాలిట ప్రాణాంతకంగా మారుతోంది. దేహంలో ఏ అవయవాన్నాయినా నాశనం చేసి మనిషి మరణానికి దారితీస్తుంది.

  • Author : hashtagu Date : 07-06-2022 - 5:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cancer Killing Virus
Cancer Killing Virus

క్యాన్సర్ ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి. ఇది మానవుడి పాలిట ప్రాణాంతకంగా మారుతోంది. దేహంలో ఏ అవయవాన్నాయినా నాశనం చేసి మనిషి మరణానికి దారితీస్తుంది. అయితే దీన్ని ఓ దశ వరకు మాత్రమే నయం చేసే అవకాశం ఉంటుంది. అయితే న్యూయార్క్ లోని స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు తాజాగా నిర్వహించిన డ్రగ్ ట్రయల్స్ క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి.

పురీష నాళ క్యాన్సర్ తో బాధపడుతున్న 18మందిపై స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు డోస్టార్లిమాబ్ అనే ఔషధాన్ని ప్రయోగించారు. వారికి 6 నెలల పాటు ఈ ఔషధాన్ని ఇచ్చారు. ట్రయల్స్ ముగిసేసరికి అందరికీ ఆశ్చర్యం కలిగేలా ఆ 18 మంది రోగుల్లో క్యాన్సర్ కణజాలం మాయమైంది.

కాగా ఆ రోగులు గతంలో క్యాన్సర్ చికిత్స భాగంగా కీమోథెరపీ, రేడియేషన్ శస్త్రచికిత్సలతో తీవ్రమైన వేదనను అనుభవించారు. వారిలో కొందరికి తీవ్రస్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చి ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఇలాంటి వారందరి పైనా డోస్టార్లిమాబ్ ఔషధం ప్రయోగించగా…ఆరు నెలల తర్వాత వారిలో క్యాన్సర్ కనిపించలేదు. తర్వాత చికిత్సలు అవసరంలేదని వారంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు.

డోస్టార్లిమాబ్ ఔషధం ల్యాబ్ లో రూపొందించిన అణువులు ఉంటాయి. మానవదేహంలోకి ప్రవేశించి యాంటీబాడీలకు నకళ్లుగా పనిచేస్తాయి. క్యాన్సర్ కణాలను నివారిస్తాయి. ఈ ఔషధం వాడిన తర్వాత 18 మంది రోగుల్లో ఎండోస్కోపీ, పీఈటీ స్కానింగ్స్, ఎమ్మారై స్కానింగ్స్ నిర్వహించారు. వాటన్నింటిలోనూ క్యాన్సర్ లేదని ఫలితాలు వెలువడ్డాయి. దీంతో పరిశోధకులు సంతోషంలో మునిగిపోయారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cancer
  • dostarlimab
  • drug trail
  • USA

Related News

H 1b Visa New Rules

H-1B Visa: హెచ్‌-1బీ వీసాలో కొత్త నిబంధనలు..

H1B Visa Rules  అమెరికా డాలర్ డ్రీమ్స్ ప్రపంచంలోనే లక్షలాది మంది యువత కల. అక్కడ ఉన్నత విద్య, ఆపై ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనే ఉద్దేశంతో అమెరికాకు విమానం ఎక్కుతారు. ఇక, ప్రతిభావంతులైన విదేశీ వర్కర్ల కోసం ఎలాగూ హెచ్-1 బీ వీసా ప్రోగ్రామ్ ఉండనే ఉంది. కానీ, ఈ ప్రోగ్రామ్ కారణంగా అమెరికన్ల ఉద్యోగాలకు భారీగా గండి పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో క

    Latest News

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • కనిష్ట స్థాయికి ప‌డిపోయిన రూపాయి విలువ‌!

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • TVK Candidate List 2026 : త్రిష చెప్పిన వారికే విజయ్ టికెట్స్ ఇచ్చాడా ?

    • ఈటీవీ భార‌త్ సంస్థ‌కు క్ష‌మాప‌ణ‌లు!

    Trending News

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd