LPG Price Cut: కేంద్రం గుడ్ న్యూస్. భారీగా తగ్గనున్న గ్యాస్ ధరలు
ఆగస్టు 31న దేశవ్యాప్తంగా రక్షాబంధన్ జరుపుకుంటారు. తోబుట్టవుల ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతిఒక్కరి జీవితాల్లో ప్రత్యేకం. చెల్లికి అన్న తోడుగా, తమ్ముడికి అక్క తోడుగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి రక్షాబంధనాన్ని కడతారు.
- Author : Praveen Aluthuru
Date : 29-08-2023 - 3:03 IST
Published By : Hashtagu Telugu Desk
LPG Price Cut: ఆగస్టు 31న దేశవ్యాప్తంగా రక్షాబంధన్ జరుపుకుంటారు. తోబుట్టవుల ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతిఒక్కరి జీవితాల్లో ప్రత్యేకం. చెల్లికి అన్న తోడుగా, తమ్ముడికి అక్క తోడుగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి రక్షాబంధనాన్ని కడతారు. అయితే రాఖీ పండుగకు ముందు రోజు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు ఊరట కలిగించే అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా LPG గ్యాస్ ధరలను తగ్గించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ఇదే జరిగితే సామాన్యులకు ఊరటనిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో 14 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.1053. ముంబైలో 14 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.1052.50గా ఉంది. చెన్నైలో రూ.1068.50, కోల్‌కతాలో రూ.1079 గా ఉంది.
జూలై ప్రారంభంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధర రూ.50 పెంచాయి. అంతకుముందు మేలో కంపెనీలు రెండుసార్లు ధరలను పెంచాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రంలోగా గ్యాస్ ధరలని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించవచ్చు. ఒక్కో సిలిండర్ ధర 200 వరకు తగ్గుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోబోతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపధ్యం కూడా ఒక కారణం కావొచ్చు.
Also Read: Kiss : మీడియా ముందే హీరోయిన్ కు ముద్దు పెట్టిన డైరెక్టర్..