Bus Accident : నెల్లూరులో ఘోర ప్రమాదం.. పెళ్లకూరు వద్ద బోల్తా పడిన బస్సు
నెల్లూరు జిల్లాలోని పెళ్లకూరు వద్ద ఘోర ప్రమాదం జరిగింది.పెళ్లకూరు చౌరస్తా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ
- Author : Prasad
Date : 18-10-2023 - 8:16 IST
Published By : Hashtagu Telugu Desk
నెల్లూరు జిల్లాలోని పెళ్లకూరు వద్ద ఘోర ప్రమాదం జరిగింది.పెళ్లకూరు చౌరస్తా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా మిట్టపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 23 మంది తిరుపతికి వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అద్దెకు తీసుకున్నారు. వీరు సోమవారం ఉదయం ఇంటి దగ్గర నుంచి బయల్దేరారు.పెళ్లకూరు క్రాస్‌రోడ్ సమీపంలో వేగంగా వెళ్తున్న బస్సుని డ్రైవర్ అదుపుచేయకపోవడంతో బస్సు బోల్తా పడింది. డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. పెళ్లకూరు ఎస్‌ఐ శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నాయుడుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పెళ్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Ganja : హైదరాబాద్‌లో 80 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ఎస్‌వోటీ పోలీసులు.. ఇద్దరు అరెస్ట్