HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Brs Mlc Kavitha Welcoming The Bilkis Bano Case Verdict

MLC Kavitha: బిల్కిస్ బానో కేసు తీర్పును స్వాగతించిన కల్వకుంట్ల కవిత

  • Author : Balu J Date : 08-01-2024 - 6:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mlc Kavitha
Mlc Kavitha

MLC Kavitha: బిల్కిస్ బానో కేసు దోషుల ముందస్తు విడుదలను రద్దు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. ఈ మేరకు కవిత గారు “ఎక్స్” లో స్పందించారు. మహిళల పట్ల నిబద్ధత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బలమైన సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. ఇలాంటి ప్రతి తీర్పు మహిళలకు అండగా నిలుస్తుందనడానికి ఉదాహరణ అని అభప్రాయపడ్డారు. న్యాయం గెలిచిందని స్పష్టం చేశారు.

కాగా, బిల్కిస్ బానో దోషులను ముందస్తు విడుదల విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని, వాటిని రద్దు చేయాలని కోరుతూ గతేడాది మే నెలలో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కు ఎమ్మెల్సీ కవిత  లేఖ రాసిన సంగతి తెలిసిందే.

బిల్కిస్​ బానో కేసులో 11మంది దోషులను జైలు నుంచి విడుదల చేస్తూ గుజరాత్​ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ చర్యలు చేపట్టే సమర్థత గుజరాత్​ ప్రభుత్వానికి లేదని, ఆ విషయం.. మహారాష్ట్ర చేతుల్లో ఉందని పేర్కొంది. నిందితులకు 2 వారాల సమయాన్ని ఇస్తూ.. ఆలోగా జైలులో లొంగిపోవాలని తీర్పులో స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో.. న్యాయం కోసం పోరాడుతున్న బిల్కిస్​ బానోకు విజయం లభించినట్టు అయ్యింది.

“వాస్తవాలను తప్పుదో పట్టించి, క్షమాపణల కోసం దోషులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. క్షమాపణ అంగీకరించి, దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఎప్పుడు గుజరాత్​ ప్రభుత్వానికి చెప్పలేదు. ఇది నేరపూరత చర్య. ఈ విషయంలో బాధితురాలి హక్కును పరిగణలోకి తీసుకోవాలి. ఆ మహిళకు గౌరవం ఇవ్వాలి. దోషులను విడుదల చేసే ముందు గుజరాత్​ ప్రభుత్వం.. నాటి తీర్పును వ్యతిరేకిస్తూ రివ్యూ పిటీషన్​ని వేసుండేది. కానీ అలా చేయలేదు. దోషులను విడిచిపెట్టే సమర్థత గుజరాత్​ ప్రభుత్వానికి లేదు,” అని బిల్కిస్​ బానో కేసుల తీర్పును వెలువరించిన జస్టిస్​ బీవై నగరత్న, జస్టిస్​ ఉజ్జల్​ భవన్​లతో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

గోద్రా ఘటన నేపథ్యంలో చెలరేగిన అల్లర్ల సమయంలో బిల్కిస్​ బానో వయస్సు 21ఏళ్లు. అప్పటికి ఆమె 5 నెలల గర్భవతి. అల్లర్లలో.. ఏడుగురు కుటుంబసభ్యులను కోల్పోయింది బిల్కిస్​ బానో. వారిలో తన 3ఏళ్ల కుమార్తె కూడా ఉండి. అంతేకాకుండా.. ఆ నాడు, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. బిల్కిస్​ బానో కేసు దర్యాప్తును గుజరాత్​ నుంచి ముంబైకి తరలించారు. కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. 11మంది నిందితులను జీవిత ఖైదు చేయాలని 2008లో తీర్పునిచ్చింది స్పెషల్​ కోర్టు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bilkis Bano case
  • brs party
  • MLC Kavitha

Related News

Harish Rao is in touch with the BJP: Revanth Reddy

Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతూ.. “నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదని పవిత్ర భద

  • CM Revanth Reddy issues a strong warning to KTR.

    Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

  • Kalvakuntla Kavitha lashes out at KTR.

    kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Delhi High Court deals a blow to Kavitha.

    kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd