HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Brs Leaders Comments On Telangana Budget 2024

Telangana Budget 2024 : గ్యారంటీలను గంగలో కలిపేసి బడ్జెట్ – కేటీఆర్

'ఆడబిడ్డలు, అవ్వాతాతలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలకు బడ్జెట్లో మొండిచేయి చూపారు. నిరుద్యోగ భృతి లేదు, విద్యా భరోసా లేదు, ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలు, ఆటో అన్నలను ఆదుకోవాలన్న మానవీయ కోణమే లేదు' అని ఆయన ఫైర్ అయ్యారు

  • Author : Sudheer Date : 25-07-2024 - 5:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR Comments
KTR Comments

కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ (Telangana Budget 2024) ఫై బిఆర్ఎస్ (BRS) ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బడ్జెట్లో భట్టి వట్టి మాటలు చెప్పారని.. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, భట్టి చేసిన బడ్జెట్ ప్రసంగం ఓ కథలా, రాజకీయ ప్రసంగంలా ఉందని పార్టీ అధినేత కేసీఆర్ (KCR) అంటుంటే..రాష్ట్ర బడ్జెట్‌ గ్యారెంటీలను గంగలో కలిపిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) విమర్శించారు.

తెలంగాణ వార్షిక బడ్జెట్ (Telangana Budget 2024 – 25) ను గురువారం అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ప్రవేశ పెట్టారు. మొత్తం రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ను శాసనసభలో ప్రవేశ పెట్టగా ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు. అలాగే పలు శాఖలకు నిధులు కేటాయిస్తున్నట్లు ఆ వివరాలు పేర్కొన్నారు. భట్టి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఫై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రతిపక్ష నేత హోదాలో శాసనసభకు హాజరైన కేసీఆర్..బడ్జెట్​పై మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ విధానపరంగా లేదని , బడ్జెట్లో దళితబంధు ప్రస్తావనే లేదని, ప్రభుత్వం దళితుల గొంతు కోసిందని ఆరోపించారు. బడ్జెట్లో భట్టి వట్టి మాటలు చెప్పారని.. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్యారెంటీలను గంగలో కలిపిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శించారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని, ఇది పూర్తిగా కోతల, ఎగవేతల బడ్జెట్‌ ఆయన మండిపడ్డారు. ఈ బడ్జెట్‌లో ఎన్నికల వాగ్ధానాలను గాలికి వదిలేసి ప్రజలను వంచించారని ఆరోపించారు. ఇది డిక్లరేషన్‌లను బుట్టదాఖలు చేసిన దోకేబాజ్‌ బడ్జెట్‌ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘ఆడబిడ్డలు, అవ్వాతాతలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలకు బడ్జెట్లో మొండిచేయి చూపారు. నిరుద్యోగ భృతి లేదు, విద్యా భరోసా లేదు, ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలు, ఆటో అన్నలను ఆదుకోవాలన్న మానవీయ కోణమే లేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

ఇక హరీష్ రావు (Harish Rao) సైతం బడ్జెట్ ఫై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.ఎన్నిక‌ల‌ప్పుడు గ్యారెంటీల గార‌డీ.. ఇప్పుడేమో అంకెల గార‌డీ అంటూ బ‌డ్జెట్‌పై హ‌రీశ్‌రావు సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఇది మొద‌టి బ‌డ్జెట్‌. ఈ బ‌డ్జెట్‌లో ద‌శ‌దిశ ఇస్తారు అనుకున్నాం కానీ ద‌శదిశ ఇవ్వ‌లేదు. రాష్ట్రాన్ని తిరోగ‌మ‌న దిశ‌లో న‌డిపేట‌టువంటి బ‌డ్జెట్ ఇది. ఆరు గ్యారెంటీలు నీరు గారిపోయాయి. సంక్షేమం స‌న్న‌గిల్లింది. అభివృద్ధి అగ‌మ్య‌గోచ‌ర‌మైంది. అన్ని వ‌ర్గాల‌ను తీవ్ర నిరాశ ప‌రిచింది అన్నారు.

ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు..!

గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్..!

వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్..!

డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన…దోకేబాజ్ బడ్జెట్..!

విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతో
ఏమార్చిన డొల్ల బడ్జెట్..!

రైతులకు…

— KTR (@KTRBRS) July 25, 2024

Read Also : Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కొనాలనుకుంటున్న ఛానెల్‌ జీరో రేటింగ్‌లో ఉందా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Finance Minister Mallu Bhatti Vikramarka
  • Telangana Budget 2024
  • telangana government

Related News

Kavitha warns the Congress government.

Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ (JVR OC) గని వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన సింగరేణి ‘బాయిబాట’ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఈ హైడ్రామా చోటుచేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా కవితను గని లోపలికి అనుమతించలేమంటూ సింగరేణి అధికారులు, పోలీసులు ఆమెను గేటు వద్దే అడ్డుకున్న

  • Massive arrangements for the Farmers' Blessing Meeting

    Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

  • Green signal for Musi rejuvenation; government approves ₹7,000 crore project.

    Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

    Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd