Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని ఓ రెస్టారెంట్‌లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు 100కు డైల్ చేసి చెప్పడంతో కలకలం రేపింది. దీంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌తో పాటు పరిసరాల్లో భయాందోళన నెలకొంది.
- By Praveen Aluthuru Published Date - 10:24 AM, Sun - 28 January 24
Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని ఓ రెస్టారెంట్‌లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు 100కు డైల్ చేసి చెప్పడంతో కలకలం రేపింది. దీంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌తో పాటు పరిసరాల్లో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు డిస్పోజల్, డిటెక్షన్ స్క్వాడ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.ప్రజల కోసం హోటల్‌ను తాత్కాలికంగా మూసివేసి పోలీసులు సోదాలు నిర్వహించారు. తర్వాత అది ఫేక్ కాల్ అని రుజువు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అర్ధరాత్రి పోలీసులు అది బూటకపు కాల్‌గా ప్రకటించి కేసు బుక్ చేశారు. కాల్ చేసిన ఆగంతుకుడిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఫేక్ కాల్స్ చేసి పోలీసుల సమయాన్ని వృథా చేయవద్దని పోలీసులు కోరుతున్నారు. ఇలా ఫేక్ కాల్స్ ద్వారా ఒక్కోసారి నిజమైన ఇన్సిడెంట్ జరిగితే నమ్మకం కోల్పోతారని పోలీసులు తెలిపారు.
Also Read: Minister Roja : పార్లమెంటు ఎన్నికల బరిలోకి రోజా.. నగరి నుంచి ఔట్ ?