TTD Chairman BR Naidu : భారత అవార్డుకు బిఆర్ నాయుడు
TTD Chairman BR Naidu : BR నాయుడు ఒక ప్రముఖ సామాజిక-రాజకీయ కార్యకర్తగా, అలాగే మీడియా రంగంలో ఎంతో పేరు పొందిన వ్యక్తిగా, అనేక నూతన మార్పులను తీసుకువచ్చారు
- By Sudheer Published Date - 09:46 PM, Tue - 18 March 25

ప్రఖ్యాత “పబ్లిక్ ఫ్రంట్” నేషనల్ ఇంగ్లీష్ వీక్లీ (“Public Front” National English Weekly)అవార్డు కమిటీ, టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల నాయుడు(Bollineni Rajagopal Naidu) గారిని ప్రతిష్టాత్మక భారత అవార్డు కి నామినేట్ చేసింది. ఆయన సమాజానికి చేసిన అమూల్యమైన సేవలను గౌరవిస్తూ ఈ అవార్డును ప్రదానం చేయాలని నిర్ణయించబడింది. BR నాయుడు ఒక ప్రముఖ సామాజిక-రాజకీయ కార్యకర్తగా, అలాగే మీడియా రంగంలో ఎంతో పేరు పొందిన వ్యక్తిగా, అనేక నూతన మార్పులను తీసుకువచ్చారు.
Aadhaar Voter Card Seeding: ఓటర్ ఐడీతో ఆధార్ లింక్.. ఈసీ కీలక ప్రకటన
టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే ఆయన అనేక సరికొత్త సంస్కరణలను అమలు చేసి, తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అనేక చర్యలను తీసుకున్నారు. దేవస్థానం నిర్వహణలో పారదర్శకతను పెంచడం, భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా పాలసీలను రూపొందించడం, ఆధ్యాత్మికతను ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడం వంటి ప్రణాళికలను ఆయన చేపట్టారు.
Piles: పైల్స్ సమస్యతో తెగ ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలను పాటించాల్సిందే!
సామాజిక, రాజకీయ రంగాల్లో ఆయన చూపిన విశేష నైపుణ్యం, నిబద్ధత, మరియు నాయకత్వ లక్షణాలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. దేశ అభివృద్ధిలో ఆయన అందించిన సేవలు అపూర్వమైనవి. టీటీడీ చైర్మన్‌గా మాత్రమే కాకుండా, ఒక సమర్థ నాయకుడిగా, సమాజ సేవకుడిగా ఆయన చేసిన కృషి దేశవ్యాప్తంగా ప్రశంసనీయమైంది. ఈ పురస్కారం ఆయన అద్భుత సేవలకు అంకితంగా నిలువనుంది.