Kerala Murder: ఒకరినొకరు నరుకున్న రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ నేతలు
కేరళలో రాజకీయ పార్టీల గ్యాంగ్ వార్ జరిగింది. ఈ గొడవల్లో ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు హత్యకు గురయ్యారు.
- By Siddartha Kallepelly Published Date - 11:27 AM, Sun - 19 December 21

కేరళలో రాజకీయ పార్టీల గ్యాంగ్ వార్ జరిగింది. ఈ గొడవల్లో ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు హత్యకు గురయ్యారు.
కేరళలోని అలప్పూజా జిల్లాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి చెందిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకుడు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ రాష్ట్ర నాయకుడు హత్యకు గురయ్యారు.
సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కేరళ రాష్ట్ర కార్యదర్శిపై శనివారం రాత్రి దాడి జరిగింది. ఆయన ద్వి చక్రవాహనంపై వెళ్తుండగా వెనకనుండి కారుతో ఢీకొట్టి ఆయన కిందపడగానే కత్తులతో నరికి చంపారు.
దీనికి ప్రతీకారంగా బీజేపీ నేతను చంపినట్లు తెలుస్తోంది. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది రంజిత్ శ్రీనివాస్ పై అలప్పూజా నగరంలోని ఆయన ఇంట్లోనే దాడి జరిగింది. ఉదయం ఆయన మార్నింగ్ వాక్ వెళ్లే సమయంలో ఆయనపై దాడి చేసి నరికి చంపారు.
ఈ వరుస హత్యలపై కేరళ సీఎం పినరయ్ విజయన్ విచారం వ్యక్తం చేశారు. రాజకీయ హత్యలను కండిస్తూనే దీనికి కారణమయ్యే వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.