BJP Leader Rape: దళిత యువతిపై బీజేపీ నేత అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాహి మసూమ్ రజా దళిత యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు
- By Praveen Aluthuru Published Date - 02:56 PM, Wed - 6 September 23

BJP Leader Rape: ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాహి మసూమ్ రజా దళిత యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సంతక్‌బీర్‌నగర్ జిల్లాలో అద్దెకు ఉంటున్న దళిత కుటుంబానికి చెందిన పెద్ద కుమార్తెపై మసూద్ రాజా అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మసూద్ పై 302, 376,354, 452, 323, 504, 506, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్, 3/4 3(2) (v) వంటి ఐపిసి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ మొత్తం వ్యవహారంలో వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని నిందితుడి చెప్తున్నాడు. తనను కుట్రలో ఇరికిస్తున్నారని వాపోయాడు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు ప్రకటించారు.
Also Read: Congress : పార్టీ లో తనకు తగిన ప్రాధ్యానత ఇవ్వడం లేదని ఎంపీ కోమటిరెడ్డి అలక