Bandi: వేములవాడలో బండి సంజయ్ పూజలు
- Author : Balu J
Date : 24-01-2022 - 4:05 IST
Published By : Hashtagu Telugu Desk
బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజరులు తీర్థ ప్రసాదాలు అందించి బండి సంజయ్ ను ఆశీర్వదించారు. ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దక్షిణ కాశీగా పేరున్న వేములావాడలో భక్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.వేములవాడ కు రూ.200 కోట్లు విడుదల చేస్తానన్న మాటలు ఏమయ్యాయని అధికార పార్టీని బండి ప్రశ్నించారు. అంతకుముందు ఆయన వేములవాడ మాజీ ఎంపిటిసి గంగాధర్ మాతృమూర్తి ఇటీవల మరణించడంతో స్థానిక నేతలతో కలిసి పరామర్శించారు. బండి సంజయ్ వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.