Biker: ఓ వ్యక్తి ప్రాణం తీసిన గాలిపటం మంజా!
సంక్రాంతి పండుగ ఆనందాలనే.. విషాదాలను నింపుతోంది. గాలిపటం మంజా కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఒకటి వెలుగుచూసింది.
- By Balu J Published Date - 09:04 PM, Sat - 15 January 22
సంక్రాంతి పండుగ ఆనందాలనే.. విషాదాలను నింపుతోంది. గాలిపటం మంజా కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఒకటి వెలుగుచూసింది. మంచిర్యాలకు చెందిన భీమయ్య (36) అనే వ్యక్తి తన భార్యతో కలిసి బైక్ పై వెళుతుండగా గాలిపటం మాంజా గొంతుకు చిక్కుకుంది. అయితే బైక్ పై వెళుతున్నందున.. గొంతు చిక్కుకొని గట్టిగా తెగడంతో చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.