Car Race : హైటెక్ సిటీ వీధుల్లో కార్ రేసర్లు హల్చల్.. పోలీసులపైకి..?
- Author : Prasad
Date : 24-05-2026 - 12:35 IST
Published By : Hashtagu Telugu Desk
వీకెండ్ వచ్చిందంటే హైదరాబాద్‌లో అర్థరాత్రి బైక్, కార్ రేసర్లు హల్చల్ చేస్తున్నారు. శని, ఆదివారాల్లో అర్థరాత్రులు యువత రోడ్లపై ఖరీదైన బైక్‌లు, కార్లు వేసుకుని రయ్యిరయ్యిమంటూ రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. బైక్ , కార్లతో రేసులు పెట్టుకుని రోడ్లపై ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ఐటీ హబ్ – నీలోఫర్ కేఫ్ ప్రాంతంలో యువకులు కార్ల రేసింగ్‌లు చేశారు. ఈ ఘటనను చూసిన పెట్రోలింగ్ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించిగా .. పోలీసులపైకి యువకుడు కారును దూసుకెళ్లాడు. దీంతో సహనం కోల్పోయిన పోలీసులు కారు అద్దాలను పగులగొట్టి .. పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.