Second Marriage: ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవాలి అంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే..?
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక మధురమైన ఘట్టం అని చెప్పవచ్చు. అలాగే ప్రతి ఒక్కరిని జీవితంలో
- By Nakshatra Published Date - 09:45 AM, Sat - 16 July 22
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక మధురమైన ఘట్టం అని చెప్పవచ్చు. అలాగే ప్రతి ఒక్కరిని జీవితంలో జరిగే అతిపెద్ద, ముఖ్యమైన వేడుక కూడా. అయితే చాలామంది పెళ్లిని జీవితంలో ఒకసారి గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ మధ్యకాలంలో రెండవ మ్యారేజ్ అన్నది ఫ్యాషన్ అయిపోయింది. చిన్న చిన్న వాటికి విడాకులు తీసుకొని విడిపోవడం రెండవ పెళ్లి చేసుకోవడం అన్నది కామన్ గా మారింది. అయితే రెండవ పెళ్లి విషయంలో మాత్రం తాజాగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను రూపొందించింది.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కానీ ఏ కారణం వల్లనైనా రెండవ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే, ప్రభుత్వం నుంచి అనుమతిని తీసుకోవడం తప్పనిసరి అని తెలిపింది. అదేవిధంగా అవి నిబంధనలను అన్ని ప్రభుత్వ శాఖలకు కూడా ఆదేశాలను జారీ చేసింది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తన భాగస్వామి నుంచి వివాహకులు తీసుకున్న తర్వాత లేదా భాగస్వామి మరణించిన తర్వాత రెండవ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే వారు పని చేస్తున్న డిపార్ట్మెంట్ హెడ్ కు సమాచారం ఇచ్చి అనుమతిని తీసుకోవాలట. అదేవిధంగా సంబంధిత విభాగం నుంచి అనుమతి వస్తేనే పెళ్లి చేసుకోవాలని చూపించింది.
ఇక ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగి రెండోసారి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే చట్టపరంగా విడాకులు తీసుకున్నట్లు నిరూపించి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని, సంబంధించిన డాక్యుమెంట్స్ ని కూడా డిపార్ట్మెంట్ కు సమర్పించాలి అని పేర్కొంది. జీవిత భాగస్వామి మరణించినా కూడా అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలట. ప్రస్తుత రోజుల్లో అయితే కొంతమంది మొదటి భార్య లేదా భర్త ఉండగానే రెండవ పెళ్లికి సిద్ధపడుతున్నారు. అలాంటివారు వీటిని తప్పకుండా పాటించాలి అని బీహార్ ప్రభుత్వం సూచించింది. అలాగే సంబంధిత విభాగం అనుమతి లేకుండా రెండో పెళ్లి చేసుకున్న ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణిస్తే ఆ వ్యక్తి రెండవ భార్యకు కానీ భర్తకు వారి పిల్లలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సౌకర్యాలు ఉండవని, అటువంటివారు వారసత్వంగా వచ్చే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు అని తెలిపింది. అయితే అలాంటి సమయంలో మొదటి భార్య లేదా భర్త ద్వారా పుట్టిన పిల్లలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు అని తెలిపింది బీహార్ ప్రభుత్వం.
Related News
Kharges Helicopter : ఖర్గే హెలికాప్టర్ తనిఖీ.. ఎన్డీయే నేతల హెలికాప్టర్లను చెక్ చేయరా ? : కాంగ్రెస్
Kharges Helicopter : కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది.