Bhaag Mantri Bhaag: కేంద్ర మంత్రి మీనాక్షి పరుగో పరుగు.. కేటీఆర్ ఫన్నీ ట్వీట్
ఢిల్లీలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖికి మీడియా సెగ తగిలింది. ఢిల్లీలో రెజ్లర్ల నిరసన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మీడియా కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని స్పందించాల్సిగా కోరింది.
- Author : Praveen Aluthuru
Date : 31-05-2023 - 7:12 IST
Published By : Hashtagu Telugu Desk
Bhaag Mantri Bhaag: ఢిల్లీలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖికి మీడియా సెగ తగిలింది. ఢిల్లీలో రెజ్లర్ల నిరసన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మీడియా కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని స్పందించాల్సిగా కోరింది. దీంతో మంత్రి సమాధానం చెప్పకపోగా అక్కడినుండి పరుగులు తీశారు. ఆమెతో సెక్యూరిటీ పరుగులు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
కేంద్రమంత్రి మీనాక్షి లేఖి తీరుపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వ్యంగ్యంగా స్పందించారు. మంత్రి పరుగులు పెట్టడం నేనైతే ఎప్పుడూ చూడలేదంటూ సెటైర్ వేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని మంత్రి కేటీఆర్ పోస్ట్ చేస్తూ ‘నేను భాగ్.. మిల్కా.. భాగ్ గురించి విన్నాను.. ఈ భాగ్ మంత్రి భాగ్ ఏంటి? మీ దగ్గర సమాధానం లేనప్పుడు ప్రెస్‌ని, పబ్లిక్‌ని ఎదుర్కొనలేరు’ అనే క్యాప్షన్‌తో కేటీఆర్ పోస్ట్ పెట్టారు. కేంద్ర మంత్రి ఉరుకులు పరుగులపై కేటీఆర్ వ్యంగ్యమైన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
I had heard of “Bhaag Milkha Bhaag”
What is this? “Bhaag Mantri Bhaag”? 😁
When you have no answers, you can’t face the press or the public https://t.co/w11pOyOZ8n
— KTR (@KTRBRS) May 31, 2023
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి బిహేవియర్ పై మండిపడింది. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న వీడియోపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ పార్టీ ట్విటర్‌లో వీడియోను పోస్ట్ చేస్తూ “మహిళా రెజ్లర్ల సమస్యపై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి తీవ్రంగా స్పందించారు” అని టాగ్ ఇచ్చారు.
महिला पहलवानों के मुद्दे पर केंद्रीय मंत्री मीनाक्षी लेखी ने दी तीखी प्रतिक्रिया
आप खुद देखें 👇 pic.twitter.com/9XqyJcwmgD
— Congress (@INCIndia) May 30, 2023
లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ ఏప్రిల్ 23 నుండి జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హరిద్వార్‌లోని నదిలో తమ పతకాలను నిమజ్జనం చేస్తామని రెజ్లర్లు ఇప్పటికే ప్రకటించారు.
Read More: Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం