Hookah Bars : కోల్‌కతాలో హుక్కా బార్‌లను నిషేధించిన బెంగాల్ ప్రభుత్వం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్‌కతాలో హుక్కా బార్‌లపై నిషేధం విధించింది. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కెఎంసి)..
- By Prasad Published Date - 07:03 AM, Sat - 3 December 22

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్‌కతాలో హుక్కా బార్‌లపై నిషేధం విధించింది. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కెఎంసి) నగరంలో హుక్కా బార్‌లను నిర్వహించే రెస్టారెంట్ల లైసెన్స్‌లను రద్దు చేస్తుందని కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ తెలిపారు. యువకులు హుక్కాకు బానిసలయ్యేలా కొన్ని మత్తు పదార్థాలు వాడుతున్నారని ఫిర్యాదులు అందియని అందువల్ల వాటిని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ తెలిపారు. నగరంలో హుక్కా బార్‌లను నిర్వహిస్తున్న రెస్టారెంట్లకు లైసెన్సులను నిలిపివేస్తామని కోల్‌కతా మున్సిపల్ కార్పోరేషన్ హెచ్చరిక జారీ చేసినట్లు మేయర్ తెలిపారు. తాము కొత్త లైసెన్సులను ఇవ్వమని.. ఇప్పటికే ఉన్న వాటిని రద్దు చేస్తామన్నారు.