BC Mahasabha : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అటకెక్కాయి: ఎమ్మెల్సీ కవిత
సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి రేపు ఉదయం 11 గంటలకు ఇందిరా పార్కు వద్ద బీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు.
- By Latha Suma Published Date - 02:33 PM, Thu - 2 January 25

BC Mahasabha : సావిత్రీ బాయి పూలే జయంతిని పురస్కరిం చుకొని రేపు(శుక్రవారం) ఇందిరా పార్కు వద్ద బీసీ మహాసభ పేరిట తెలంగాణ జాగృతి సంస్థ భారీ సభను తలపెట్టనుంది. కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్‌తో ఈ సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
The Congress government in Telangana has turned its back on the very people it vowed to uplift during the elections.
Two key promises that were made to for the BCs – The implementation of the Kamareddy Declaration and 42% reservations for BCs in local body elections— now lie… pic.twitter.com/3ku4djxVo4
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 2, 2025
కామారెడ్డి డిక్లరేషన్ అమలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇప్పుడు అటకెక్కాయని విమర్శించారు. సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి రేపు ఉదయం 11 గంటలకు ఇందిరా పార్కు వద్ద బీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు. బీసీ మహాసభ పోస్టర్‌ను బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో బీసీలకు హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక వారికి కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కవిత ధ్వజమెత్తారు.
కాగా, ఈ బీసీ మహాసభకు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యార్థి జేఏసీతో పాటు మరిన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు మద్ధతు ప్రకటించాయి. బీసీల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు తాము వెన్నుదన్నుగా నిలుస్తామని ఆ సర్పంచ్ ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ప్రకటన చేశారు. తాము పెద్ద సంఖ్యలో మహాసభకు హాజరవు తాయని, తమ హక్కులను సాధిస్తామని స్పష్టం చేశారు.