Bandla tweet On Vijay Devarakonda: తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ ఉండాలి!
రౌడీ హీరో విజయ్ దేవరకొండపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ రెచ్చిపోయారు.
- Author : Balu J
Date : 23-07-2022 - 12:43 IST
Published By : Hashtagu Telugu Desk
రౌడీ హీరో విజయ్ దేవరకొండపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ రెచ్చిపోయారు. విజయ్ నుద్దేశించి ‘‘తాతలు తండ్రులు ఉంటే సరిపోదు బ్రదర్.. టాలెంట్ ఉండాలి’’ అంటూ షాకింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్ గా మారింది. లైగర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎటువంటి నేపథ్యం లేకపోయినా అభిమానులు తనను ప్రేమిస్తున్నారని విజయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. విజయ్ బ్యాగ్రౌండ్ సరిపోదని, సక్సెస్ కావాలంటే ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి ప్రతిభ అవసరమని విజయ్ ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్‌లో విజయ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. కరణ్ జోహార్, పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్, హీరో యష్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ చిత్రంలో మాజీ ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో అనన్య పాండే కథానాయిక. అజీమ్ దయాని సంగీతం అందించిన ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్. ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ 🔥🔥🔥🔥 @AlwaysRamCharan @tarak9999 @urstrulyMahesh 🐅🐅🐅🐅
— BANDLA GANESH. (@ganeshbandla) July 22, 2022