Taraka Ratna: తారకరత్నను చూసి బాలయ్య కన్నీరు… పరుగెత్తుకుంటూ వచ్చి హత్తుకున్న నిషిక!
నందమూరి బాలకృష్ణకు తారకరత్న అంటే ఎంతో ప్రేమ, అభిమానం. అలాగే తారకరత్నకు కూడా నటసింహం బాలయ్య అంటే ఎంతో ప్రాణం. బాలకృష్ణను అప్యాయంగా బాల బాబాయ్ అంటూ తారకరత్న పిలుస్తుండేవారు.
- Author : Anshu
Date : 19-02-2023 - 9:01 IST
Published By : Hashtagu Telugu Desk
Taraka Ratna: నందమూరి బాలకృష్ణకు తారకరత్న అంటే ఎంతో ప్రేమ, అభిమానం. అలాగే తారకరత్నకు కూడా నటసింహం బాలయ్య అంటే ఎంతో ప్రాణం. బాలకృష్ణను అప్యాయంగా బాల బాబాయ్ అంటూ తారకరత్న పిలుస్తుండేవారు. అలాంటి వ్యక్తి లేకపోవడంతో బాలకృష్ణ ఎంతో మనోవేదనకు గురవుతున్నారు. తారకరత్నను బతికించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఎంత ఖర్చైన భరిస్తానని ముందుకు వచ్చారు. కానీ విధి సహకరించలేదు. తారకరత్న చనిపోయారు. ఆయన పార్థీవదేహాన్ని చూసి బాలకృష్ణ కన్నీటిపర్యంతమయ్యారు.
సినీ నటుడు తారకరత్న భౌతికకాయాని నివాళులర్పించేందుకు రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన నివాసానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చేరుకుంటున్నారు. తారకరత్న భౌతికకాయానికి ఆయన బాబాయి, సినీ నటుడు బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఉన్న విజయసాయిరెడ్డితో బాలకృష్ణ మాట్లాడారు. అలేఖ్య రెడ్డిని బాలకృష్ణ ఓదార్చారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన తారకరత్న కూతురు నిషిక.. ఒక్కసారిగా బాలకృష్ణను హత్తుకున్నారు. ఈ క్రమంలోనే నిషికను బాలకృష్ణ ఓదార్చారు.
ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కూడా తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మాట్లాడిన చిరంజీవి..తారకరత్న కుటుంబ సభ్యులనూ పరామర్శించారు. తారకరత్న భౌతిక కాయాన్ని సోమవారం అభిమానుల సందర్శనార్థం ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్‌లో ఉంచనున్నారు. రేపు ఉదయం 8.45 గంటలకు ఫిల్మ్ చాంబర్‌కు తారకరత్న భౌతికకాయం తరలించనున్నారు. మధ్యాహ్నం వరకు తారకరత్న భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు. అనంతరం తారకరత్న అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నందమూరి కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.