Indian Students: భారత విద్యార్థులపై ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు నిబంధనలు
ఐదు విశ్వవిద్యాలయాలు భారత విద్యార్థులపై నిబంధనలు విధించాయి.
- By Balu J Published Date - 01:10 PM, Wed - 19 April 23
ఆస్ట్రేలియాకు చెందిన ఐదు విశ్వవిద్యాలయాలు భారత విద్యార్థులపై నిబంధనలు విధించాయి. 2019లో 75 వేలమంది భారత విద్యార్థులు ఆస్ట్రేలియాకు విద్యాభ్యాసానికి వెళ్లారు. అయితే, వారిలో చాలా మంది తప్పుడు దరఖాస్తులు సమర్పించారని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
ఈ ఏడాది కూడా భారీగా తప్పుడు దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో విక్టోరియా, ఎడిత్ కొవాన్, వొలొంగాంగ్, టోరెన్స్, సదరన్ క్రాస్ యూనివర్సిటీలు భారత విద్యార్థులపై నిబంధనల్ని ప్రకటించాయి. పెర్త్‌లోని ఎడిత్ కొవాన్ వర్సిటీ పంజాబ్, హరియాణ విద్యార్థులను నిషేధించింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ సహా ఎనిమిది రాష్ట్రాల విద్యార్థులపై విక్టోరియా యూనివర్సిటీ నిబంధనల్ని విధించింది.