ATM Van Driver: రూ.60 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ డ్రైవర్!
ఏపీలోని కడప జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ‘క్యాష్ లాజిస్టిక్స్ సంస్థ’ డ్రైవర్ రూ.60 లక్షల నగదుతో వ్యాన్‌తో పరారయ్యాడు.
- By Balu J Published Date - 11:41 AM, Sat - 17 September 22

ఏపీలోని కడప జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ‘క్యాష్ లాజిస్టిక్స్ సంస్థ’ డ్రైవర్ రూ.60 లక్షల నగదుతో వ్యాన్‌తో పరారయ్యాడు. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని ఏటీఎంలలో బ్యాంకు ఇచ్చిన నగదును ఒక ఏజెన్సీ నింపుతుంది. ఏజెన్సీ సిబ్బంది శుక్రవారం బ్యాంకు నుంచి రూ.80 లక్షల నగదు తీసుకుని వాహనంలో బయలుదేరారు. ఐటీఐ సర్కిల్‌లోని బ్యాంకు ఏటీఎం వద్దకు సిబ్బంది వెళ్లగా డ్రైవర్ షారుఖ్ వాహనంతో పరారయ్యాడు. వాహనంలో సుమారు రూ.60 లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు. శివారులోని వినాయకనగర్ వద్ద డ్రైవర్ వాహనాన్ని వదిలి నగదుతో పరారయ్యాడు. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు
Related News

TDP : చంద్రబాబు అరెస్ట్ కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు