Telangana Assembly : మార్చి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు..19న బడ్జెట్
14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 21 నుంచి 26 వరకు పద్దులపై చర్చ ఉండనుంది.
- Author : Latha Suma
Date : 12-03-2025 - 3:40 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Assembly : మార్చి 27 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. మార్చి 19న బడ్జెట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయిచింది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉండనుంది. 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 21 నుంచి 26 వరకు పద్దులపై చర్చ ఉండనుంది.
Read Also: Kidney Problems: మీకు కిడ్నీ సమస్య ఉందో లేదో తెలుసుకోండిలా!
అసెంబ్లీ ఛాంబర్ లో జరిగిన బీఏసీ సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, భట్టి, శ్రీధర్ బాబు,పొన్నం, బీఆర్ఎస్ తరపున హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి,బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈరోజు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. నేడు ఉభయ సభలనుద్దేశించి మాట్లాడిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. అన్ని వర్గాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సామాజిక న్యాయం,సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలకు,యువతకు ,రైతులకు పెద్ద పీఠ వేస్తున్నామని చెప్పారు. రైతుల అభివృద్దికోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.