Asaduddin Owaisi : RSS చీఫ్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఎదురుదాడి… ముస్లింల జనాభా తగ్గుతోంది…!!
జనాభా నియంత్రణపై RSSచీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రకటనపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎదురుదాడికి దిగారు.
- By hashtagu Published Date - 07:58 PM, Sun - 9 October 22

జనాభా నియంత్రణపై RSSచీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రకటనపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎదురుదాడికి దిగారు. ముస్లింల జనాభా తగ్గుతోందన్నారు. 2000 సంవత్సరం నుంచి 2019 వరకు 90 లక్షల మంది హిందూ బాలికలు భ్రూణహత్యలకు గురయ్యారన్నారు. మోహన్ భగవత్ ముస్లిం జనాభా గురించి మాట్లాడుతారు..కానీ భ్రూణహత్యలపై ఎందుకు మాట్లాడరంటూ ప్రశ్నించారు.
ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. అసదుద్దీన్ ఓవైసీ స్టేట్ మెంట్ మ్యాన్ గా మారారని వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ అన్నారు. తక్కువ జనాభా సమాజానికి మేలు చేస్తుంది. జనాభా ఎంత పెరిగితే అన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది ఓవైసీ గ్రహించాలన్నారు.