Arvind Kejriwal: ఈడీ నోటీసులు..వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరైన కేజ్రీవాల్
- By Latha Suma Published Date - 12:35 PM, Sat - 17 February 24

Delhi-Liquor-Scam-Case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) ఈరోజు వర్చువల్ రీతిలో ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్(video-conference) ద్వారా ఆయన రోజ్ అవెన్యూ కోర్టు విచారణలో పాల్గన్నారు. లిక్కర స్కామ్(delhi liquor scam case)తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో ఆయన ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అయిదు సార్లు కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు(ED summons) జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. అయితే ఈ కేసులో వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించారు. లిక్కర్ స్కామ్‌లో తదుపరి విచారణ మార్చి 16వ తేదీన నిర్వహించనున్నారు.
ఆప్ ప్రభుత్వంలో గతంలో రద్దయిన మద్యం కుంభకోణం(Liquor scam), మనీ లాండరింగ్ కేసు(money laundering cases)లో ఈడీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీచేసింది. ఈ తరుణంలోనే సీఎం కేజ్రీవాల్ కోర్టుకు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా హాజరయ్యారు. శనివారం ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలతో పాటు అవిశ్వాస తీర్మానం ఉన్న కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు కేజ్రీవాల్ న్యాయవాధి రమేష్ గుప్తా(Ramesh Gupta). అలాగే తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతారని కోర్టుకు తెలిపారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కాస్త ఉపశమనం కల్పించారు.
We’re now on WhatsApp. Click to Join.
వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా కోర్టుకు హాజరైన కేజ్రీవాల్ తన ప్రస్తుత పరిస్థితి గురించి వివరించిన తరువాత.. కోర్టు తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేసింది. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇచ్చిన నోటీసులపై స్పందించింది ఈడీ. లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ సీఎం కేజ్రీవాల్ స్పందించక పోవడంతో రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించామన్నారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. దీనిపై స్పందించి కోర్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేయడంతో విచారణకు హాజరైనట్లు తెలిపారు. ఇప్పటికే ఆరుసార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఐదు సార్లు విచారణను బేఖాతరు చేసిన సీఎం కేజ్రీవాల్, ఫిబ్రవరి 19 విచారణకు రావాలని పంపిన సమన్లపై కూడా స్పందించలేదు. దీంతో ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది ఈడీ. అయితే ఇన్నాళ్లు స్పందించని కేజ్రీవాల్ తాజాగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. తనపై ఉద్దేశపూర్వకంగానే కేసులు పెడుతున్నారన్నారు. గతంలో తన ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సమయంలో నోటీసులు పంపించారని తెలిపారు. ఇవి కేవలం రాజకీయ ప్రేరేపితమైనవేనని కోర్టుకు తెలిపారు. గతంలో రాసిన లేఖలు, జరిగిన పరిణామాలను న్యాయమూర్తికి అందజేశారు.
READ ALSO :Yuvraj Singh: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ.. వారిపైనే అనుమానం..!