Lord Sri Ram : ఇంట్లో రాముడి ఫొటో పెట్టేందుకు వాస్తు నియమాలివీ..
Lord Sri Ram : హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు. చాలామంది రాముడి చిత్రపటం లేదా విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని పూజిస్తుంటారు.
- Author : Pasha
Date : 10-01-2024 - 3:39 IST
Published By : Hashtagu Telugu Desk
Lord Sri Ram : హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు. చాలామంది రాముడి చిత్రపటం లేదా విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని పూజిస్తుంటారు. రాముడు తన భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు , హనుమంతునితో కలిసి ఉన్న రామ దర్బార్ ఫొటోనే ఎక్కువగా పూజిస్తుంటారు. ఈ ఫొటో శ్రీరాముడి రాజ్యం, ఆయన నియమాలను అద్దం పడుతుంది. రామదర్బార్‌ను రోజూ పూజిస్తే ఇంట్లో ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయి. ఈ ఫొటోను ఇంట్లో అమర్చుకునే విషయంలోనూ వాస్తు శాస్త్ర నియమాలను పాటిస్తే శుభాలు కలుగుతాయి. ఇంట్లో సానుకూల శక్తి ఎల్లప్పుడూ నివసిస్తుంది. ఆనందం , శ్రేయస్సు వెల్లివిరుస్తాయి. కానీ చాలామంది దేవుళ్ల ఫొటోలను ఇంట్లో అమర్చేటప్పుడు వాస్తు శాస్త్ర నియమాలను పాటించరు. దీనివల్ల జీవితంలో సమస్యలు(Lord Sri Ram) ఎదురవుతాయి.
We’re now on WhatsApp. Click to Join.
- ఇంట్లో శ్రీరామ దర్బార్ చిత్రాన్ని ఉంచడం కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది. వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- ఇంట్లోని ఆలయ తూర్పు గోడపై రామ దర్బార్ చిత్రాన్ని ఉంచాలి.
- శ్రీరామ దర్బార్‌ను సరైన దిశలో ఉంచడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య శాంతి నెలకొంటుంది.
- వాస్తు దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read: 78 Year Imprisonment : ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్‌కు 78 ఏళ్ల జైలు
భుజంపై కాషాయ జెండా, ఒంటిపై హిజాబ్ ధరించిన యువతి షబ్నమ్ షేక్ ముంబై నుంచి అయోధ్యకు బయలుదేరింది. ఆమె తన ఇద్దరు స్నేహితులతో కలిసి దాదాపు 1,500 కి.మీ. దూరంలో ఉన్న అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం బయలుదేరింది. ముంబై నుంచి నడుచుకుంటూ వస్తున్న షబ్నం షేక్‌ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికి షబ్నం రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి నాసిక్ చేరుకుంది. సమయం ఇస్తే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలుస్తానని షబ్నం అంటోంది. షబ్నమ్ రాంలాలాను చూడాలనుకుంటోంది. ఆమె తనను తాను సనాతన ముస్లిం అని చెప్పుకుంటుంది. ఆమెకు భద్రత కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు మహిళా పోలీసులను ఏర్పాటు చేసింది. షబ్నమ్‌కి చిన్నప్పటి నుంచి రామాయణం అంటే అమితమైన ఇష్టం. ఆమె మహాభారతం సీరియల్ పూర్తిగా చూసింది. రామాయణం, మహాభారతాలు ఆమె జీవితాన్ని చాలా బాగా ప్రభావితం చేశాయి. ఆమె రాముడిని తన రోల్ మోడల్‌గా భావిస్తుంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా తనను అయోధ్యకు వెళ్లమని ప్రోత్సహించారు. అయోధ్యలో శ్రీరాముడి దర్శనం అనంతరం ఆమె అయోధ్యలోని ధనిపూర్‌లో నిర్మాణంలో ఉన్న మసీదుకు వెళ్లనున్నారు. దీని ద్వారా తనకు రెండు మతాల పట్ల ఆసక్తి ఉందనే సందేశాన్ని అందించబోతోంది.